ముగ్గురు డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీస్‌ తూర్పు మండల జోన్‌ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఏటీవీ రవికుమార్‌కు ఏఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మరి కొంతకాలం ఇన్‌ఛార్జి డీఎస్పీగా అర్బన్‌ పరిధిలో కొనసాగనున్నారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రవికుమార్‌ 2012లో గ్రూప్‌-1 ర్యాంకు సాధించి డీఎస్పీ హోదాలో సీఐడీ, పోలవరం ఇరిగేషన్‌, గత రెండున్నర ఏళ్లుగా రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ సౌజన్యకు ఏఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అనిశా జిల్లా ఇన్‌ఛార్జి ఏఎస్పీ హోదాలో రాజమహేంద్రవరం కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. 2012 గ్రూప్‌-1 ర్యాంకు సాధించిన ఆమె తెనాలిలో పోలీసు శాఖలో, గుంటూరు క్రైం, ఐటీ, ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఇన్‌ఛార్జి ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతం ఆ హోదాలో విధులు కొనసాగిస్తున్నారు. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావుకు అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 ఎస్సై బ్యాచ్‌కి చెందిన ఈయన ప్రత్తిపాడులో ఎస్సైగా శిక్షణ పొంది తొలుత పెదపూడి ఎస్సైగా తరువాత జగ్గంపేట ఎస్సైగా తరువాత పెద్దాపురం సీఐగా విధులు నిర్వర్తించారు. 2019లో పెద్దాపురం డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)