డిసెంబర్ 20 నుంచి కొత్త మార్గదర్శకాలు ?

Telugu Lo Computer
0


ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపధ్యంలో కేంద్రం ప్రభుత్వం మరోసారి కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాలకు కోవిడ్ రిస్క్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ తప్పనిసరిగా ఆర్టీపీఎస్ఆర్ పరీక్షను ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించింది. ఈ కొత్త గైడ్‌లైన్స్ డిసెంబర్ 20వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో 1 కొత్త కేసు, దేశ రాజధాని ఢిల్లీలో మరో నాలుగు కేసులతో కలిపి, భారతదేశం మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 49కి పెరిగాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు నమోదు కాగా, రాజస్థాన్ లో 13, కర్ణాటకలో 3, గుజరాత్‌లో 4, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క కేసు బయటపడింది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 6, చండీగఢ్ ఒక కేసు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో ఇవాళ ఒక్కరోజే కోవిడ్-19 ఓమిక్రాన్ వేరియంట్‌ నాలుగు కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)