ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు

Telugu Lo Computer
0


ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నాటికి ఇది బలహీనపడి వాయుగుండంగా మారి అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తుపాను తీరం దాటనుంది. అంతకు ముందు 2008 నవంబర్‌ 13న నెల్లూరు వద్ద తుపాను తీరాన్ని దాటింది. వాతావరణశాఖ తెలిపిన మేరకు.. గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, ఒకటిరెండు చోట్ల భారీవర్షాలు కురిసే సూచనలున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతిభారీ వర్షాలు, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శుక్రవారం నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల అతితీవ్రమైన భారీవర్షాలు, గుంటూరు, అనంతపురం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)