బాహుబలి రికార్డును బద్దలు కొట్టిన సూర్యవంశీ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 11 November 2021

బాహుబలి రికార్డును బద్దలు కొట్టిన సూర్యవంశీ


చాలా కాలం తర్వాత హిందీలో రిలీజైన మాస్ మసాలా సినిమా కావడం.. నార్త్ మార్కెట్ అంతటా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోవడం.. దీపావళి పండుగ టైంలో సినిమా రిలీజ్ కావడంతో సూర్యవంశీ వెండితెరల్లో వెలుగులు నింపుతోంది. ఈ క్రమంలో బాహుబలి-2, ఎవెంజర్స్-ఎండ్ గేమ్ సినిమాల రికార్డులను అది బద్దలు కొట్టింది. పీక్ టైంలో బుక్ మై షోలో సూర్యవంశీ సినిమాకు సంబంధించి సెకనుకు 17 టికెట్లు అమ్ముడయ్యాయట. ఇప్పటిదాకా ఇండియన్ బాక్సాఫీస్‌లో ఏ సినిమాకూ ఈ ఫ్రీక్వెన్సీలో టికెట్లు అమ్ముడవ్వలేదట. బాహుబలి-2, ఎవెంజర్స్ సినిమాలకు సంబంధించి సెకనుకు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో తెలియదు కానీ.. వాటిని అధిగమించి సూర్యవంశీ టికెట్ల అమ్మకాల్లో రికార్డు నెలకొల్పినట్లు బుక్ మై షో వాళ్లే స్వయంగా వెల్లడించారు. ఈ గణాంకాల్ని బట్టి సూర్యవంశీ హిందీ ప్రేక్షకుల్లో బాగానే వేడి పుట్టించిందని అర్థమవుతోంది. ఇక మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమాకు వసూళ్ల విషయంలో ఢోకా లేదు. ఇండియాలో తొలి వీకెండ్లోనే ఈ సినిమా దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ అక్షయ్ సినిమా బాగానే సందడి చేస్తోంది. ఇప్పటిదాకా రూ.35 కోట్ల దాకా ఓవర్సీస్ మార్కెట్ నుంచి వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును ఈజీగానే అందుకునేలా ఉంది.

No comments:

Post a Comment