ఎగిరి కౌంటర్‌లో పడ్డాడు!

Telugu Lo Computer
0

 

తెలంగాణ లోని ఖమ్మం నగరంలోని రావిచెట్టు బజార్‌లో ఓ బట్టల షాపులో షాపు యజమానితో పాటు ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు ముచ్చటిస్తున్నారు. షాపు బయటి నుంచి ఏదో వేగంగా వస్తోందని కండ్లు తిప్పేలోపు ఓ బైకర్‌ గుండె ఆగిపోయినంత పనిచేశాడు. పల్సర్‌ బైక్‌ మీద అతివేగంతో నేరుగా షాపులోకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో షాపులో పేర్చిన బట్టలను ఢీ కొట్టి ఎగిరిపోయి కౌంటర్‌లో పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి, బైక్‌కు ఏమీ కాకపోగా.. షాపులోని వారు తృటిలో తప్పించుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సూపర్ డ్రైవింగ్ అంటూ పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)