మీ బావే నన్ను బయటకు పంపారు !

Telugu Lo Computer
0


నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న బుల్లితెర టాక్ షో అన్‌స్టాపబుల్ తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చారు. ఈ ఎపిసోడ్‌లో బాలయ్య - మోహన్‌బాబు మధ్య పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. విచిత్రం ఏంటంటే బాలయ్య మోహన్‌బాబును మాత్రమే ప్రశ్నలు వేయడం కాదు, అటు మోహన్‌బాబు కూడా బాలయ్యకు పలు ప్రశ్నలు సంధించాడు. ఈ కండీషన్ మీదే మోహన్‌బాబు ఈ షోకు గెస్ట్ గా వచ్చాడు. ఈ క్రమంలోనే అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఉంది.. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లారు ? అయినా ఇంకో పార్టీలోకి ఎందుకు వెళ్లారన్న ప్రశ్న బాలయ్య వేశారు. దీంతో మోహన్‌బాబు ఏ మాత్రం తడుముకోకుండానే చంద్రబాబే తనను పార్టీ నుంచి బయటకు పంపేశారని చెప్పారు. అన్న ఎన్టీఆర్ తనను క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని బిరుదు ఇచ్చారని.. అయితే చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి అయ్యాక తనకు క్రమశిక్షణ లేదని చెప్పి పార్టీ నుంచి బయటకు పంపేశారని మోహన్‌బాబు చెప్పారు. పైగా బాలయ్యతో మీ బావే నన్ను బయటకు పంపారని కాస్త సీరియస్‌గానే చెప్పారు. ఇక టీడీపీ నుంచి ఎన్టీఆర్ దయతో రాజ్యసభకు ఎంపిక అయిన మోహన్‌బాబు ఆ పార్టీకి దూరమయ్యాక చాలా యేళ్ల పాటు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే గత సాధారణ ఎన్నికలకు ముందే తన తనయుడు మంచు విష్ణుతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)