కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన రైల్వే

Telugu Lo Computer
0


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పార్కింగ్ కు రూ. 500 వసూలు చేశారంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
దీనిపై నెటిజన్లు ఇదేం అన్యాయం అంటూ రైల్వేను ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బ్రిగేడియర్ జైరత్ అనే మీజీ సైనిక ఉద్యోగి తన కారును 31 నిమిషాలు పార్కింగ్ చేసినందుకు రైల్వే సిబ్బంది రూ. 500 వసూలు చేసినట్లు ఆరోపించాడు. ఇందుకు సంబంధించిన రశీదును ట్విట్టర్ లో పోస్టు చేశాడు. పార్కింగ్ బిల్‎ను జైరత్ పురపాల శాఖ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. అతడి ట్వీట్‌కు మంత్రి సైతం స్పందించారు. ఇది నిజంగా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ట్విట్టర్ ద్వారా కోరారు. ఏకంగా కేటీఆర్ స్పందించడంతో ఈ వార్త వైరల్ గా మారింది. రైల్వేపై సామాన్యులు దుమ్మెత్తి పోశారు. ఇలా అయితే బతికేదెలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ. 500 పార్కింగ్ ఫీజును వసూలు చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేసింది దక్షిణ మధ్య రైల్వే. అనవసర రద్దీని నివరించడానికి ఓవర్ స్టే పార్కింగ్ ఫీజును మాత్రం వసూలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. టూ వీలర్ పార్కింగ్ కు మొదటి రెండు గంటలకు రూ. 15 రూపాయలు పార్కింగ్ ఛార్జి అని, 4 వీలర్ కు మొదటి రెండు గంటలకు పార్కింగ్ ఛార్జి రూ. 50 అంటూ స్పష్టం చేసింది. అయితే స్టేషన్ లో జనాలు సంచరించే ప్రాంతంలో అనధికారికంగా పార్కింగ్ చేయవద్దని ప్రయాణికులకు సూచించింది. ఎక్కువ సేపు అనధికారికంగా స్టేషన్ పరిసరాల్లో పార్కింగ్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
ఆ ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి..
-8 నిమిషాల వరకు స్టేషన్ పరిసరాల్లో ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు.
-8 నుంచి 10 నిమిషాల వరకు రూ. 100 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
-16-30 నిమిషాల వరకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.
-30 నిమిషాలు దాటిన తర్వాత అనధికార పార్కింగ్ కు రూ. 500 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)