అంతర్జాతీయ వేదికపై భారత్ కీలక విజయం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 14 November 2021

అంతర్జాతీయ వేదికపై భారత్ కీలక విజయం


స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు (క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ సీఓపీ26) ముగిసింది. గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే ప్రపంచ దేశాల ఒప్పందం లక్ష్యంతో ఈ చర్చలు ముగిశాయి. అయితే, ఈ సదస్సులో అంతర్జాతీయ దౌత్యపరంగా భారత్ గొప్ప విజయం సాధించింది. ఈ వాతావరణ చర్చల్లో భాగంగా బొగ్గు వినియోగాన్ని తగ్గించే దిశగా ప్రపంచ దేశాలను ఒప్పించడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. ఈ కాప్ 26 సదస్సులో దాదాపు 200 దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ సదస్సులో అమెరికా క్లైమేట్ చీఫ్ జాన్ కెన్రీ మాట్లాడుతూ వాతావరణ మార్పు కోసం ఇది తొలి అడుగు మాత్రమే అని, దీంతో లక్ష్యం చేరుకున్నట్లు కాదని అన్నారు. మనందరి లక్ష్యం కాలుష్య రహిత ప్రపంచం అని చెప్పారు. బొగ్గు ఇంధనం, అసమర్థమైన శిలాజ ఇంధనం తగ్గించడాన్ని వేగవంతం చేయడంలో కొన్ని దేశాల నుంచి బలమైన వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, అమెరికా, టర్కీ, కొలంబియా, ఇండోనేసియా, జపాన్‌ దేశాలు తమ మునుపటి అభిప్రాయానికి భిన్నంగా గణనీయమైన మార్పును ఆశిస్తూ ఈ ఒప్పందానికి మద్దతివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామంగా ఉంది. కాప్ గ్లాస్గో ఒప్పందంలో దాదాపు 200 దేశాలు వాతావరణ ఒప్పందాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు, అంతేకాక ప్యారిస్ వాతావరణ ఒప్పందంలోని అంశాలను పాటించేందుకు అంగీకరించాయి. వాతావరణ మార్పుపై వివిధ దేశాల ప్రతినిధులు రెండు వారాలగా కీలకమైన చర్చలను అత్యవసరంగా కలిపి ఈ ప్రపంచ వాతావరణ చర్యను వేగవంతం చేయడంలో సఫలం సాధించారు. మొత్తానికి ఈ కాప్ 26 సదస్సును ఏకాభిప్రాయంతో ముగించారు. వాతావరణ మార్పునకు వివిధ దేశాల నుంచి వచ్చిన మద్దతుతో, గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించే ఆశయం అనేది ఇప్పుడు కనుచూపు మేరలో కనిపిస్తోందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అయితే ఇది అన్ని దేశాల సమష్ఠి కృష్టితోనే కాక, తక్షణ చర్యల ద్వారా మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలిగే అవకాశం ఉంటుంది. గ్లాస్గో క్లైమేట్ ఒప్పందం ఈ వాతావరణ చర్య వేగం పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించింది. మళ్లీ అన్ని దేశాలు తమ ప్రస్తుత కర్బన ఉద్గారాల లక్ష్యాలను 2030లో రివ్యూ చేయడానికి అంగీకరించాయి. ఆదే ఏడాదిలో వాతావరణ చర్యలను మరింత బలోపేతం చేయడానికి అంగీకరించాయి.

No comments:

Post a Comment