కూలిన ఎనిమిది అంతస్తుల భవనం

Telugu Lo Computer
0


ఇటీవల కురిసిన వర్షాలకు సిమ్లాలోని ఓ ఎనిమిది అంతస్తుల భవనం కూలిపోయింది. అయితే భవనం కూలినా.. ఏ ఒక్కరికీ ప్రాణనష్టం జరగలేదని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణా విభాగం పేర్కొంది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ డైరెక్టర్‌ సుదేశ్‌ కుమార్‌ మోఖ్తా తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా.. కొండచరియలు విరిగిపడటంతో సిమ్లాలోని హాలి ప్యాలెస్‌ సమీపంలో ఘోడా చౌకీ వద్ద ఎనిమిది అంతస్తుల భవనం కూలిపోయిందని ఆయన తెలిపారు. ఈ ప్రభావంతో కూలిపోయిన భవనానికి పక్కనున్న రెండు భవనాలు కంపించాయి. ఈ రెండు భవనాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని ఆయన వెల్లడించారు. ఆ భవనంలో ఉంటున్న నివాసితులకు జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్కరికీ పది వేల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం అందించిందని మోఖ్తా పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)