నువ్వుల నూనె - ప్రయోజనాలు

Telugu Lo Computer
0

 

ఆయుర్వేదంలో నువ్వుల నూనె ప్రాముఖ్యతను ఏ ఇతర నూనె కూడా భర్తీ చేయలేదు. చూడ్డానికి చాలా చిన్నగా కనిపించే నువ్వుల గింజల్లో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే సామర్థ్యం ఉంది. అందుకే శతాబ్ద కాలంగా ఆయుర్వేద మందులను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు నిపుణులు. రకరకాల అనారోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగించే అన్ని ఆయుర్వేద మందులలో 40 శాతం నువ్వులే ఉంటాయి. బోలెడు ఔషధగుణాలు ఉన్న నువ్వుల గింజలను పౌడర్, పేస్ట్ లేదా నూనెల రూపంలో సాంప్రదాయ భారతీయ ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. నువ్వుల నూనెను నువ్వుల నుంచి తయారు చేస్తారు. వంటకాల్లో కూడా వాడుతుంటారు. ఒక టీస్పూన్ నువ్వుల నూనెలో 120 క్యాలరీలు, 14 గ్రాముల కొవ్వు ఉంటాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మాత్రం 0 గ్రాములు ఉంటాయి. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం ఆయుర్వేదంలో కీలకమైన వైద్య చికిత్సగా వస్తోంది. నువ్వుల నూనె చర్మం కణజాలాల్లోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ఇది చర్మం దిగువ పొరను చేరుకుని.. చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తుంది. నూనెలో ఉండే విటమిన్ ఇ యూవీ కిరణాలు, కాలుష్యం, టాక్సిన్స్ నుంచి చర్మ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఈ నూనె శరీరంలో వేడిని పెంచుతుంది. ఇది కండరాల నొప్పి, దగ్గు, జలుబు తగ్గించడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల మీ శరీరానికి కావాల్సిన వేడి అందుతుంది. బాడీ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. వేసవిలో నువ్వుల నూనెను ఉపయోగించకూడదు. ఇతర నూనెలతో పోలిస్తే నువ్వుల నూనె  త్వరగా జీర్ణమవుతుంది. నువ్వుల నూనెలో పుష్కలంగా లభించే ఫైబర్ ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల కారణంగా నువ్వుల నూనె కీళ్ల వాపు, పంటినొప్పి, గీరుకుపోయిన గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్లనొప్పులకు సంబంధించిన వాపు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎలుకలపై నిర్వహించిన అనేక అధ్యయనాలు నువ్వుల నూనె ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తాయని తేల్చాయి. ఈ నూనెను గాయమైన ప్రాంతంలో లేదా కాలిన గాయాలపై మర్దన చేస్తే.. గాయాలు మానుతాయి. నిద్రలేమితో బాధపడేవారికి నువ్వుల నూనె మంచి ప్రయోజనాలు అందిస్తుంది. నుదుటిపై నువ్వుల నూనె చుక్కలతో 5 నిమిషాలు మసాజ్ చేయడం వల్ల బాగా నిద్ర పడుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)