శ్రీవారి దర్శనానికి ఆర్.టి.సి ఏర్పాట్లు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.  ఏ.పి.ఎస్.  ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానములు అధికారులు ఈ  అవకాశం కల్పించారు. ఏ.పి.ఎస్. ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చు.  ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు ఉంటుంది.  తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు ఆర్.టి.సి సూపర్ వైజర్లు సహాయం చేస్తారు.  తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా ఆర్.టి.సి బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది. ఆర్.టి.సి ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది.  ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది.  బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చే  ప్రయాణికులకు ఇది చాలా సౌకర్యం.

Post a Comment

0Comments

Post a Comment (0)