ఎరువులపై సబ్సీడీ పెంపు

Telugu Lo Computer
0


కేంద్రప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా ఎరువులపై రాయితీని భారీగా పెంచినట్లు సోమవారం కేంద్ర రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ రైతులకు పాత ధరలకే ఎరువులు అందించేలా చూడాలన్న ఉద్దేశంతో యూరియా,డీఏపీ,సింగిల్ సూరప్ ఫాస్పేట్,నైట్రోజన్ పాస్పరస్ పొటాషియం(NPK) ఎరువులపై సబ్సిడీని పెంచినట్లు ఆయన తెలిపారు. డీఏపీ ఎరువుపై ప్రస్తుతం బస్తాకు ఇస్తున్న రాయితీ ధర రూ.1200 కాగా దానిని రూ.1650కి పెంచారు. యూరియాపై అందిస్తున్న రాయితీని రూ.1500 నుంచి రూ.2000కు పెంచగా,NPKపై అందిస్తున్న రాయితీని రూ.900 నుంచి 1015కి,SSPపై అందిస్తున్న రాయితీని రూ.315 నుంచి రూ.375కి పెంచినట్లు మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఈ రాయితీ పెంపు నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ.28,655 కోట్ల భారం పడనుంది. అక్టోబర్ 2021 నుండి మార్చి 2022 వరకు జరిగే రబీ లేదా శీతాకాల నాటడం సీజన్ కోసం రూ. 28,655 కోట్ల అదనపు ఎరువుల సబ్సిడీని గతవారం కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)