డియోడ్రెంట్‌ ధాటికి పడక గదిలో భారీ పేలుడు!

Telugu Lo Computer
0

 

లండన్‌ కు చెందిన డెంటిస్ట్‌గా పనిచేసే ఒక డాక్టర్ కి  అట్రిన్‌ బెమజాది(13) అనే  కొడుకు ఉన్నాడు. ఓ రోజు అట్రిన్‌ బయటకు వెళ్లడం కోసం రెడీ అవ్వసాగాడు. దానిలో భాగంగా డియోడ్రెంట్‌ స్ప్రే చేసుకున్నాడు. అయితే పొరపాటున ఆ స్ప్రే పక్కనే ఉన్న క్యాండిల్‌ను తాకింది. దాంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అట్రిన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే.. అక్కడి దృశ్యాలు చూసిన వారికి ఇక్కడేమైనా బాంబు పేలిందా.. అనిపించేంత ప్రమాద ధాటికి బెడ్రూం కిటికీలు, తలుపు బద్దలయ్యాయి. పక్కరూమ్‌లో ఉన్న అట్రిన్‌ సోదరి ప్రమాదాన్ని గమనించి.. అగ్నిమాపక సిబ్బందికి కాల్‌ చేసింది. వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రస్తుతం అట్రిన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)