కప్పు టీ రూ.1,000 ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Thursday, 14 October 2021

కప్పు టీ రూ.1,000 ?

 


హైదరాబాద్ లో ఇరానీ ఛాయ్ ఎంత ప్రసిద్దో అందరికీ తెలిసిందే. పాత బస్తీలో ఇరానీ చాయ్ రుచి దేనికీ సాటి రాదు. ఒక్క కప్పు తాగితే వన్ మోర్ అనాల్సిందే. సాధారణంగా కప్పు టీ ఎంత ఉంటుంది.. రూ.5 నుంచి రూ.20 ఉంటుంది. కొన్ని హోటల్లో అయితే రూ.100 ఉంటుంది. కానీ అక్కడ ఒక్క ఛాయ్ ఖరీదు వెయ్యి రూపాయలు. నిలోఫర్ కేఫ్ దగ్గర. గమ్మత్తైన ఘుమఘుమలాడే సువాసన.. మైమరపించే రుచి.. తాగితే అద్భుతమైన అనుభూతి తప్పదంటున్నారు ఈ చాయ్ తయారు చేసేవారు. అస్సలు ఇంత రేటు ఎందుకు పెట్టాలి.. అందులో ఏముందో తెలుసుకుందాం. ఈ ఛాయ్ అనేది ముదురు బంగారు వర్ణంలో ఉంటుంది. తయారు చేయడానికి అందులో వేసే పొడి అత్యంత ఖరీదనైది మరియు అరుదైనది కూడా. మొగ్గల నుంచి తయారయ్యే పొడి. అస్సోంలోని బ్రహ్మపుత్ర నదీ తీరప్రాంతం మైజాన్‌ టీ తోటల్లో మాత్రమే లభిస్తుంది. అవి అత్యంత అరుదైనవి. ఎందుకంటే.. అవి ఏడాదికి ఒక్కసారి మాత్రమే మొగ్గల రూపంలో వస్తాయి. వాటిని సూర్యోదయానికి ముందే కోసి.. ఆరపెట్టి.. పొడిగా చేస్తారు. అలా ఆ పొడి కూడా కిలో లేదా కిలోన్నర మాత్రమే ఉత్పత్తి అవుతుంది. దీంతో ఈ పొడికి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ పొడిని కొనుగోలు చేయటానికి ఎంత ధర అయినా పెడతారు వ్యాపారులు. డబ్బులు ఉన్నా దానిని దక్కించుకోవడం మాత్రం అంత సులువు కాదు. దానికి వేలం నిర్వహిస్తుంటారు. కోల్ కత్తాలో నిర్వహించిన వేలంలో నిలోఫర్‌ కేఫ్‌ యజమాని బాబూరావు ఈ పొడిని రూ.75 వేలకు దక్కించుకున్నారు. ఇలా అతడు తయారు చేసే ఛాయ్ లో వీటిని కలుపుతుంటాడు. అందుకే ఆ ఛాయ్ కి అంత ఖరీదు. ఈ టీలో పాలను అస్సలు కలపరని అతడు చెప్పాడు. టీ పొడి డికాషన్‌ రూపంలోనే మంచి టేస్ట్‌ ఉంటుందట. ఇలా ఒక కప్పు టీలో 4 గ్రాములు గోల్డెన్ టిప్స్‌ను వినియోగిస్తామని చెబుతున్నారు నిలోఫర్‌ కేఫ్‌ యజమాని. ఇంతటి అమోఘమైన చరిత్ర ఉన్న ఈటీకి అంత ధర ఉంది మరి. కానీ ధర ఎక్కువగా ఉందని ఎవరూ ఏ మాత్రం వెనకడుగు వెయ్యకుండా.. దాని విశేషాలు తెలిసి ఆ ఛాయ్ ని తాగుతున్నారట. మీకు కూడా ఇలాంటి టీని టేస్ట్ చేయాలని ఉందా.. అయితే హైదరాబాద్ లోని నిలోఫర్ కేఫ్ కు వెళ్లాల్సిందే. కొంతమంది ఎక్కువగా వెరైటీ టేస్ట్ లను టేస్ట్ చేయాలని ఉంటుంది. అలాంటి వారికి ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది. అక్కడ ఉపయోగించే తేయాకు కిలో రూ. 75 వేలు. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

No comments:

Post a Comment

Post Top Ad