ఎపి లో సీబీఎస్‌ఈ ప్రమాణాలకు అనుగణంగా పాఠ్యాంశాల మార్పు

Telugu Lo Computer
0



ఆంధ్రప్రదేశ్‌లో 8, 9, 10 తరగతుల పాఠ్యాంశాల్లో మార్పులు చేసే యోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సీబీఎస్‌ఈ ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించనున్నట్లు చెప్పారు. పాఠ్యాంశాల మార్పుపై 130 మంది ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. పాఠ్యాంశాల రూపకల్పనపై ఉపాధ్యాయులకు సూచనలు చేశామన్నారు. ప్రభుత్వ భావజాలం, సీఎం జగన్‌ ఆలోచనా విధానం ప్రతిబింబించేలా పాఠాలు ఉంటాయన్నారు. అమ్మ ఒడి పథకంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చునని.. అధికారంలోకి రాగానే విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని సురేశ్‌ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)