ఐపీ పెట్టిన వ్యాపారి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 13 October 2021

ఐపీ పెట్టిన వ్యాపారి


ఆంధ్రప్రదేశ్ లోని  చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో వస్త్రాల వ్యాపారి పాండురంగయ్య శెట్టి గత అరవై ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. పాండురంగయ్య శెట్టి వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు.  వడ్డీ వ్యాపారంలో పూర్తిగా నష్టపోయి రూ.87.84 కోట్లుకు కోర్టులో ఐపీ పిటిషన్ వేశారు. 60 ఏళ్లుగా మండల కేంద్రంలో బట్టల వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆయనపై నమ్మకంతో చుట్టుపక్కల నాలుగు మండలాల్లో రైతులు నమ్మకంతో తన వ్యాపారానికి అప్పుగా కోట్ల రూపాయలను ఇచ్చేవారు. అప్పు ఇచ్చిన వారికి సకాలంలో పిలిచి వడ్డీ ఇవ్వడం చూసి మరికొందరు ఆశతో కోట్ల రూపాయలు ఇచ్చి మోసపోయారు. అయితే గత వారం రోజులుగా ఈ బట్టల వ్యాపారి తన కుటుంబ సభ్యులతో సహా అదృశ్యం కావడంతో అప్పులిచ్చిన బాధితులు పెనుమూరులోని తమ షాపు వద్ద భారీ ఎత్తున ధర్నాకు దిగారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు నచ్చచెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పులిచ్చిన రైతులకు క్షమాపణలు చెప్పిన మనవడు ''పరిస్థితి బాగోలేక ఉన్నదీ అమ్మినా సరిపోలేదు అందుకే ఐపీ పెట్టాం. అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చెప్తున్నా.. నా పరిస్థితి అర్థం చేసుకోండి. కోర్టులో నడుస్తున్న భూమి కేసు పరిష్కారం అయితే కానీ మా కష్టాలు తీరవు' ఇది వ్యాపారి కోడూరు రంగయ్య శెట్టి మనువడు ప్రవీణ్‌కుమార్‌ ఐపీ బాధితులకు పెట్టిన వాట్సప్‌ మెసేజ్ సారాంశం. వారం రోజుల క్రితం వ్యాపారి దుకాణం సద్దేయడంతో డీఎస్పీ సుధాకరరెడ్డి, పాకాల సీఐ ఆశీర్వాదం బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు. అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికి రంగయ్యశెట్టి మనుమడు ప్రవీణ్ వాట్సప్‌ సందేశాన్ని పంపించాడు. ప్రవీణ్ తండ్రి పలు రంగాల్లో నష్టపోయినట్లు వివరించారు. అందులో ముఖ్యంగా ట్రావెల్స్, వడ్డీ, గ్రానైట్స్, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో పూర్తిగా నష్టపోయినట్లు చెప్పాడు ప్రవీణ్. అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆరు నెలల క్రితం వరకూ నెలకు రూ.కోటి వడ్డీ కడుతూ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్లాట్లు, 70 ఎకరాల భూమి అమ్ముకున్నట్లు మెసేజ్‌లో రాశాడు. ఇక అమ్మేందుకు ఎలాంటి ఆస్తి  లేకపోవడంతోనే ఐపీ పెట్టినట్లు ఆ సందేశంలో పేర్కొన్నాడు. అప్పు ఇచ్చిన వారు తన పరిస్థితి అర్థం చేసుకోవాలని.., అందరికి పాదాభి వందనాలు అని పేర్కొన్నాడు. ప్రవీణ్ కు ఉన్న స్థిరాస్థులలో కొంత భూమి తిరుపతిలో ఉంది. ఈ స్థలంపై కేసు నమోదు అయ్యి కోర్టులో వాదోపవాదాలు సాగుతున్నాయి . ఆ కేసు పరిష్కారం అయితే కష్టాలు తీరుతాయని ప్రవీణ్ లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం తన సమస్యలు తీరేందుకు రెండు మార్గాలు మిగిలాయని, ఒకటి ఆత్మహత్య చేసుకోవడం, రెండు తాను బతికినంత కాలం అప్పు తీర్చేందుకు శ్రమిస్తానంటూ మెసేజ్‌లో రాసుకొచ్చారు. ఆ తర్వాత ప్రవీణ్‌ వాట్సాప్‌ చేసిన ఫోన్‌ స్విచాఫ్‌ వచ్చింది. పోలీసులు ఆ మెసేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.

No comments:

Post a Comment

Post Top Ad