చల్లపల్లి చిట్టిబాబు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 13 October 2021

చల్లపల్లి చిట్టిబాబు


చిట్టి బాబు ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. కర్ణాటక సంగీతంలో చెప్పుకోదగ్గ ప్రముఖ వైణికులలో ఈయనొకరు. ఈయన గొప్పతనం తన జీవితకాలంలోనే చారిత్రక పురుషునిగా చరితార్థుడు కావడం. వీణాపాణిగా అందరిలోనూ గుర్తింపు పొంది వీణ చిట్టిబాబుగా గుర్తింపబడ్డారు. చల్లపల్లి చిట్టిబాబు 1936 అక్టోబరు 13 న కాకినాడలో సంగీతాభిమానుల ఇంట పుట్టారు. చల్లపల్లి రంగారావు, చల్లపల్లి సుందరమ్మలు ఇతడి తల్లిదండ్రులు. ఇతడికి హనుమానులు అని నామకరణం చేసి ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాతి కాలంలో ముద్దుపేరే అసలు పేరయింది. ఐదేళ్ల వయసులోనే వీణను వాయించడం మొదలు పెట్టిన అపార ప్రతిభాశాలి. కొన్ని సందర్భాలలో తండ్రి వాయించే తప్పుడు శృతులను సరిచేయటం చూసి, తండ్రి చిట్టిబాబును మరింత సాధన చేసేలా చేసారు. మొదటి ప్రదర్శన 12వ యేట ఇవ్వడం జరిగింది. మొదట్లో శ్రీ ఎయ్యుని అప్పలాచార్యులు, పండ్రవడ గారి వద్ద శిష్యరికం చేసారు. తరువాత మహామహోపాధ్యాయ డా॥ఈమని శంకరశాస్త్రి వద్ద ముఖ్య శిష్యుడయ్యారు. ప్రముఖ వీణాకచేరీ విద్వాంసుడిగా చిట్టిబాబు సంగీత కళాజగతిలో సుస్థిరస్థానాన్ని పొందారు. ఆయన 'కోయిలా గీతా విన్యాసం తప్పక చెప్పుకునే అంశం. ఆయన వీణా వాదన విన్యాస కళపై లఘుచిత్రం 'కళాకోయిలా అన్నది కూడా మరువలేని సాక్ష్యం కొన్ని చిత్రాలకు చిట్టిబాబు సంగీత దర్శకత్వం కూడా వహించడం విశేషం. ప్రముఖ నిష్ణాత సభ్యుల సంఘం - శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ, తిరువాయూర్ లో సభ్యత్వం, శ్రీ కంచి కామకోటి పీఠానికి ఆస్థాన విద్వాంసకత్వం, చిట్టిబాబు ప్రతిభాసిగలో . చిట్టిబాబును ఆవరించిన అసంఖ్యాకమైన పురస్కారాల్లో, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన విద్వాంసుడిగా, మన పొరుగు రాష్ట్రం తమిళనాడు ప్రభుత్వం (1981-87) కలికి తురాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ (1984), సంగీత నాటక అకాడమీ పురస్కారం (1990) ను పొందారు 1948లో చిట్టిబాబును సినిమాలలో నటింపచేయాలని, కుటుంబం మద్రాసుకు వలసపోయారు. లైలా మజ్నూ చిత్రంలో బాలనటుడిగా వేషం వేసారు కూడా. మరో చిత్రంలో చిన్న పాత్ర వేసారు. అయితే, చిట్టిబాబుకు సంగీతం మీదే మక్కువ ఎక్కువయింది. అందుకని ఈమని శంకర శాస్త్రి వద్ద సంగీత సాధన మొదలుపెట్టి, ఎన్నో పద్ధతులు, సూక్ష్మభేదాలు నేర్చుకున్నారు. సినిమా కళాకారుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా ఆ రోజుల్లోని అందరు యువ కళాకారులలాగానే చిట్టిబాబు కూడా చాలా కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. అందువలన ఆయన వీణ వాయించడమే, ఆయనకో గుణమయింది. 1948 నుండి 1962 వరకూ దక్షిణ భారత సినిమాలలో రికార్డింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసారు.ఈ కాలంలోనీ సాలూరి రాజేశ్వర రావు, పెండ్యాల నాగేశ్వర రావు ఇంకా విశ్వనాథన్-రామమూర్తిల జోడీతో పని చేసే అవకాశం కలిగింది. ఆ కాలంలో వచ్చిన అన్ని ప్రముఖ పాటలనూ సూపర్ హిట్ చేయటంలో చిట్టిబాబు వీణ పాత్ర ఎంతో ఉంది. చాలా కాలం సినిమా ఇంకా శాస్త్రీయ సంగీతం రెంటిలోనూ ప్రతిభ చాటుకున్నారు. కొన్ని ముఖ్యమయినవి: తమిళ సినిమా కలై కోవిల్కి సౌండ్‍ట్రాక్ అందించారు. ఈ సినిమా నాయకుడి పాత్ర కూడా వైణికునిదే, సినిమా అంతటా నేపథ్య సంగీతం చిట్టిబాబు అందించారు.ఈ సినిమా ఎందరి మన్నంలో పొందింది. తెలుగు సినిమా సంపూర్ణ రామాయణంకు టైటిల్ సౌండ్‍ట్రాక్‍గా రఘువంశ సుధా అన్న కృతిని వీణాలాపన ద్వారా అందించారు.సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించిన దిక్కట్ర పార్వతికి సంగీత దర్శకునిగా వ్యవహరించారు.1979లో కన్నడ చిత్రం శ్రీ రాఘవేంద్ర మహిమెకి సంగీతం అందించారు. ఇది తరువాత తెలుగులోకి డబ్ అయింది.

No comments:

Post a Comment

Post Top Ad