ఈటల, రేవంత్‌ భేటీ వెనుక మతలబేంటి?

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ సమీపిస్తోన్న నేపథ్యంలో తెరాస, భాజపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఈటలపై మంత్రి కేటీఆర్‌ తాజాగా పలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ నేతలతో ఆయన కుమ్మక్కయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో ఈటల, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ కలుసుకున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. వారి భేటీ వెనక మతలబేంటని ప్రశ్నించారు. ఈటల, రేవంత్‌ కలిశారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. వారిరువురూ కలిసినట్లు ఉన్న ఆధారాలు బయటపెడతాం అని అన్నారు. ఎన్నికల సంఘం పరిధి దాటి వ్యవహరిస్తోందని తెలిపారు. హుజూరాబాద్‌లో తెరాసను నిలువరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్, భాజపా ఉమ్మడి అభ్యర్థిగా ఈటల కొనసాగుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)