జీర్ణశక్తిని మెరుగుపరిచే తొమ్మిది సూత్రాలు.. - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 24 October 2021

జీర్ణశక్తిని మెరుగుపరిచే తొమ్మిది సూత్రాలు..

 

 

వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య చాలామంది ఎదుర్కుంటున్న సమస్య ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం. ఇలా జరగడం వల్ల మనిషిలో జీర్ణశక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ ఈ సమస్య మీలో ఉందని గమనిస్తే దీనిని ముందుగానే పసిగట్టి దానికి తగిన చర్యలు తీసుకోవడం మేలు. లేకపోతే చిన్నగా మొదలైన ఈ సమస్య పూర్తిగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చు.  

* జీర్ణ శక్తి సరిగా లేకపోయినా లేదా అందులో ఏదైనా సమస్య ఉన్నాఅది చర్మంపై, శరీరంపై ఇట్టే తెలిసిపోతుంది. అందుకే జీర్ణ శక్తి మెరుగుపడడానికి పలు చిట్కాలు పాటిస్తే మేలు. దీనికోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ఆహారం తినే సమయంలో కొన్ని నియమాలు గుర్తుపెట్టుకుంటే చాలు. 

* ఆకలిగా ఉన్నప్పుడే మాత్రమే తినాలి. ఎందుకంటే మనకు ఆకలి మొదలయ్యిందంటే ముందు తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యిందని అర్థం. 

* ప్రశాంతంగా ఉన్న చోటులో కూర్చుని తింటే మంచిది. నిలబడి తినడం కంటే కూర్చుని తింటే అది ఇంకా మేలు. కానీ తినేటప్పుడు ఫోన్, టీవీ లాంటివి చూడకపోతే మంచిది. 

* మన శరీరానికి ఎంత అయితే సరిపోతుందో అంతే ఆహారం తీసుకోవడం మంచిది. ఆహారం విషయంలో సంతృప్తి చెందిన తరువాత కూడా తినడం జీర్ణశక్తికి అంత మంచిది కాదు. 

* ఫ్రిడ్జ్‌లో ఉన్న ఆహారం కంటే ఎప్పటికప్పుడు వండిన ఆహారం అయితే జీర్ణశక్తికి మంచిది. చాలాసేపటి క్రితం ఆహారం కూడా జీర్ణశక్తిని దెబ్బతీసే అవకాశం ఉంది. 

* ఫ్రై లాంటి వాటికి దూరంగా ఉండడం జీర్ణశక్తికి మేలు. ఆహారంలో కనీసం నూనె ఉండేలా చూసుకోవాలి. అది మరీ డ్రైగా ఉండకూడదు. 

* ఒకేసారి ఏది పడితే అది తినడం మంచిది కాదు. ఒక్కోసారి రెండు ఆహార పదార్థాలను కలిసి తీసుకోవడం జీర్ణ శక్తిపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు పాలు, పండ్లు.. చేప కూరలు, పాలు.. ఒకేసారి కలిపి తీసుకోవడం మంచిది కాదు.

* గబగబా  తినకూడదు. ఆదరబాదరాగా తినడం వల్ల ఆహారం అరగకపోవచ్చు. అందుకే నమలడానికి తగినంత సమయం తీసుకోవాలి. నమలడం జీర్ణ శక్తికి ఎంతో మేలు చేసే ప్రక్రియ. 

* తినే విషయంలో రోజు ఒకే సమయాన్ని పాటించడం మంచిది. తినేటప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే జీర్ణశక్తికి ఎంతగానో తోడ్పడే అవకాశం ఉంది.No comments:

Post a Comment