దూసుకొస్తున్న మరో తుపాను

Telugu Lo Computer
0


అక్టోబరు 10న ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం  ఇప్పటికే ప్రకటించింది. అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారనుంది. పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర వైపు కదులుతూ అక్టోబరు 12 నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అది మరింత బలపడి ఈ నెల 13, 14 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఒకవేళ తుపానుగా మారితే ఈ నెల 15న విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల మధ్య తీరం దాటే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై రేపు స్పష్టత వచ్చే అవకాశముందని వెల్లడించింది. ఆదివారం ఏర్పడనున్నఅల్పపీడనం... వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా బలపడితే జావద్‌గా నామకరణం చేస్తారు. ఇది అతి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశముందని తెలుస్తోంది. దీని ప్రభావంతో ఏపీ, ఒడిశాలో భారీగా వర్షాలు పడుతాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)