జార్ఖండ్‌లో భూకంప

Telugu Lo Computer
0



జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం, ఆదివారం మధ్యాహ్నం 2:22 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపం సమయంలో చిన్నపాటి కదలికలే కానీ, ప్రమాదం ఏమీ జరగలేదని అధికారులు చెబుతున్నారు. అస్సాంలోని తేజ్‌పూర్‌లో కూడా భూమి కంపించినట్లుగా అధికారులు వెల్లడించారు. తేజ్‌పూర్‌లో 2.40 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లుగా చెబుతున్నారు. అస్సాంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8 గా నమోదవగా.. ఇది చాలా స్వల్పమైనదని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

భూకంపం సంభవిస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలు:ఇంట్లో ఉంటే కచ్చితంగా బయటకు రావాలి.బయటకు వచ్చిన తర్వాత భవనాలు, చెట్లు, స్తంభాలు మరియు వైర్‌లకు దూరంగా ఉండాలి.వాహనంలో ప్రయాణిస్తుంటే, వీలైనంత త్వరగా వాహనాన్ని ఆపుకోవాలి.అగ్గిపుల్ల వెలిగించకూడదు, శబ్దం చేయరాదు.

Post a Comment

0Comments

Post a Comment (0)