నెలసరి టైంలో రెండు రోజులు సెలవు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 22 October 2021

నెలసరి టైంలో రెండు రోజులు సెలవు

 

పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, వారు నెలసరి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. దీని గురించి ఎలా చెబితే.. ఏ విధంగా రియాక్టవుతారోనని బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్విగ్గీ సానుకూల నిర్ణయం తీసుకున్నది. తమ సంస్థలో పని చేసే డెలివరీ ఉమన్‌కు ప్రతి నెలా రెండు రోజుల సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. వారు నెలలో ఎప్పుడైనా రెండు రోజులు సెలవు తీసుకోవచ్చునని స్విగ్గీ ఆపరేషన్స్ వైస్‌ప్రెసిడెంట్ మిహిర్‌షా తన బ్లాగ్‌లో రాసుకున్నారు. నెలసరి టైంలో మహిళలు బయటకు రావాలన్నా, రోడ్డుపై తిరగాలన్నా ఇబ్బంది పడుతుంటారు. డెలివరీ సేవల్లోకి రావడానికి వారు వెనుకంజ వేయడానికి ఇదొక కారణం. ఇటువంటి పరిస్థితుల్లో వారికి అండగా నిలవాలని స్విగ్గీ నిర్ణయించుకుందని మిహిర్‌షా తెలిపారు. అంతే కాదు.. రాత్రి టైంలో డెలివరీ సేవలకు డిమాండ్ ఉన్నా.. సాయంత్రం ఆరు గంటల తర్వాత మహిళలతో ఫుడ్ డెలివరీ నిలిపేస్తున్నామన్నారు. తొలుత పుణెలో 2016లో స్విగ్గీ డెలివరీ సేవల్లోకి మహిళలను అనుమతించారు. తర్వాతి దశలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మహిళలు స్విగ్గీ డెలివరీ ఉమన్‌గా సేవలందిస్తున్నారు. స్విగ్గీ నిర్ణయం పట్ల నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.


No comments:

Post a Comment