'రెస్టోరా గోల్డ్' ను ఆవిష్కరించిన డాబర్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 22 October 2021

'రెస్టోరా గోల్డ్' ను ఆవిష్కరించిన డాబర్భారతదేశంలో సుప్రసిద్ధ, శాస్త్ర ఆధారిత ఆయుర్వేద కంపెనీ డాబర్‌ ఇండియా లిమిటెడ్‌ ఇప్పుడు కుటుంబమంతటికీ అధిక ప్రయోజనాన్ని కలిగించే జీర్ణక్రియ ఔషదం 'డాబర్‌ రెస్టోరా గోల్డ్‌'ను ఆవిష్కరిస్తున్నట్టు వెల్లడించింది. ఆరోగ్య వంతమైన జీర్ణక్రియను నిర్వహించడంలో ఇది తోడ్పడటంతో పాటుగా నీరసం, అలసట నుంచి ఉపశమనాన్ని ఇది అందిస్తుంది. ప్రీమియం నాణ్యత కలిగిన ఆరోగ్యదాయకమైన ఔషద ఉత్పత్తి డాబర్‌ రెస్టోరా గోల్డ్‌ . ఇది మీ శరీరం లోపల నుంచి ఉత్తేజం కావడానికి అవసరమైన అత్యవసర పోషకాలను అందిస్తుంది. శక్తి, బలం కోసం తీర్చిదిద్దబడిన అత్యున్నత ఆయుర్వేదిక్‌ ఔషదాలలో ఇది ఒకటి. దీనిలో అత్యంత సహజసిద్ధమైన పదార్థాలైనటువంటి నేపాల్‌లోని వ్యవసాయ క్షేత్రాలలో లభించే అత్యున్నత నాణ్యత కలిగిన యాపిల్స్‌, అంజీర్‌, ఖర్జూర , ద్రాక్ష, కేసర్‌, సేఫ్డ్‌ ముస్లి, అశ్వగంధ, షతవారి వంటివి ఉన్నాయి. ఇవి ఎలాంటి దుష్ఫరిణామాలు లేకుండా పునరుద్ధరించబడిన శక్తిని అందిస్తాయి. ఈ టానిక్‌లో ఏపీఐ ప్రమాణాలకు అనుగుణంగా అతి తక్కువ ఆల్కహాల్‌ కంటెంట్‌ వినియోగించడంతో పాటుగా డబుల్‌ ఫిల్టరేషన్‌తో ప్రీమియం అసవ్‌ జోడించారు. ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు ఈ సూత్రీకరణ తోడ్పడటంతో పాటుగా శరీరంలో అవాంఛిత విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది డాబర్‌ ఇండియా లిమిటెడ్‌, కేటగిరి హెడ్‌ ఆయుర్వేదిక్‌ ఎథకల్స్‌ , డాక్టర్‌ మణ్‌దీప్‌ ఓబరాయ్‌ అన్నారు.

No comments:

Post a Comment