రిక్షావాలాకు రూ.3 కోట్లు కట్టాలంటూ ఐటీ నోటీసులు

Telugu Lo Computer
0

 


ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా అమర్ కాలనీకి చెందిన ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి రిక్షా నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అతనికి ఐటీ శాఖ నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు వెంటనే రూ.3 కోట్లు ట్యాక్స్ కట్టాలని తెలిపారు. దీంతో ప్రతాప్ సింగ్ కు ఏం చేయాలో తెలియక మధుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ దీంట్లో ఏదో మతలబు ఉందని భావించిన పోలీసు అధికారి అనూజ్ కుమార్ సింగ్ కేసు నమోదు చేయకుండా దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా ప్రతాప్ సింగ్ ను పలు ప్రశ్నలు వేశారు. ఇటీవల కాలంలో నువ్వేమన్నా ఎక్కడన్నా సంతకాలు పెట్టావా? అని అడిగారు.దానికి ప్రతాప్ సింగ్ మార్చి 15న తేజ్ ప్రకాష్ ఉపాధ్యాయ్ యాజమాన్యంలోని బకల్‌పూర్‌లోని జన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని పాన్ కార్డును సమర్పించాల్సిందిగా తన బ్యాంక్ చెప్పారని దాని కోసం నేను పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు. ఆతరువాత కొన్ని రోజులకు నాకు బకాల్ పూర్ చెందిన సంజయ్ సింగ్ నుంచి పాన్ కార్డు కలర్ జిరాక్స్ ఫొటో కాపీ వచ్చిందని..ఆ తరువాత నాకు అక్టోబరు 19వతేదీన ఐటీ అధికారుల నుంచి తనకు (మొబైల్ నం. 9897762706) ఫోన్ వచ్చిందని..ఆ ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి 3,47,54,896రూపాయల ఆదాయపు పన్ను చెల్లించాలని పేర్కొన్నారని రిక్షావాలా చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులకు విషయం అర్థం అయ్యింది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరో వ్యాపారి సదరు రిక్షా వాలా ప్రతాప్ సింగ్ పేరుపై జిఎస్‌టి నంబరు పొందారని, 2018-19లో వ్యాపారి టర్నోవర్ రూ.43,44,36,201 అని అధికారులు చెప్పారని సింగ్ చెప్పాడు. నేను నిరక్షరాస్యుడినని ఎవరో తనను మోసగించారని వాపోతూ నా కేసు నమోదు చేసుకుని నాకు న్యాయం చేయాలని పోలీసుల్ని కోరాడు. ఇదే విషయాన్ని నేను ఐటీ అధికారులకు తెలిపానని వారు వెంటనే పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయమని అన్నారని వారి సలహా మేరకు నేను పోలీసులకు ఫిర్యాదు చేశానని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాడు రిక్షా వాలా ప్రతాప్ సింగ్.


Post a Comment

0Comments

Post a Comment (0)