చైనాలో జోరుగా కోవిడ్ టీకా కార్యక్రమం

Telugu Lo Computer
0


చైనాలో కోవిడ్ టీకా కార్యక్రమం జోరుగా సాగుతోంది. 76 శాతం దేశ జనాభాకు పూర్తిస్థాయిలో టీకాలు వేసినట్లు వెల్లడించింది చైనా జాతీయ హెల్త్ కమిషన్. 141 కోట్ల జనాభాలో 106 కోట్ల మందికి టీకా వేసినట్లు తెలిపిన చైనా ఆరు నెలల క్రితం చివరి డోసు తీసుకున్న వయోజనులకు బూస్టర్ డోసును కూడా వేస్తున్నట్లు పేర్కొంది. చైనా టీకాలైన సినోవాక్, సినోఫార్మ్ తీసుకున్న తర్వాత ఉత్పత్తి అవుతున్న యాంటీబాడీలు కొన్ని నెలలు మాత్రమే ఉంటున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో అవసరమైన వారికి బూస్టర్ డోసులను కూడా చైనా ఇస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)