లక్ష పెట్టుబడితో రూ.2 లక్షలు రాబడి !

Telugu Lo Computer
0



కిసాన్ వికాస్ పత్ర లో  డబ్బులు పెట్టుబడి పెడితే 124 నెలల్లో.. అంటే 10 సంవత్సరాల 4 నెలల్లో డబుల్ అయ్యిపోతాయి. ఈ స్కీమ్ ని ఇండియాన్ పోస్ట్ అమలు చేసింది. ఆ తరవాత మరి కొన్ని బ్యాంకులు కూడా దీనిని అమలు చేసాయి. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే 6.9 శాతం వడ్డీ రేటు వస్తుంది. దేశంలో నివాసముండే భారతీయులు అందరూ దీనికి అర్హులు. అలానే 18 సంవత్సరాల పైబడిన వారు ముగ్గురు కలిసి కిసాన్ వికాస్ పత్ర జాయింట్ అకౌంట్ తెరవవచ్చు. 10 సంవత్సరాల వయస్సున్న మైనర్ లేదా అతడి సంరక్షకుడు లేదా మానసికంగా ఎదగని పిల్లల సంరక్షులు మైనర్ల పేరుతో కూడా ఈ స్కీమ్ ని ఓపెన్ చెయ్యచ్చు. జాయింట్ అకౌంట్ హోల్డర్ మరణిస్తే, అకౌంట్ ను కలిగిన మిగిలిన వారికి బదిలీ అవుతుంది. కిసాన్ వికాస్ పత్ర అనేది 30 నెలల లాక్-ఇన్ పీరియడ్ తో వస్తుంది. అంటే ఈ 30 నెలల కాలంలో అకౌంట్ హోల్డర్ తన ఇన్వెస్ట్ మెంట్ ని విత్ డ్రా చేసుకోలేడు. ఇది ఇలా ఉంటే 30 నెలలు గడిచాక ఆరు నెలల బ్లాక్ లలో తన డబ్బును విత్ డ్రా చెయ్యచ్చు. ప్రీమెచ్యూర్ విత్ డ్రా కోసమైతే అకౌంట్ హోల్డర్ పెట్టిన పెట్టుబడిలో కొంత భాగం అకౌంట్ ని తెరిస్తే వడ్డీ వస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)