బోయి భీమన్న - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 19 September 2021

బోయి భీమన్న


బోయి భీమన్న, సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. సహజంగానే ఆయన వీటిని నిరసించారు. అంబేద్కర్ వ్రాసిన కులనిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు. భీమన్న 1911 సెప్టెంబరు 19 న తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో ఓ హరిజన కుటుంబంలో పుట్టారు.నాగమ్మ, పుల్లయ్య ఇతని తల్లిదండ్రులు. వీరికి పంచపాండవుల వలె ఐదుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల జన్మించారు. పుల్లయ్య తన మగపిల్లలకు వరుసగా ధర్మరాజు, భీమన్న, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే పేర్లు పెట్టారు.భీమన్న 1935లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణుడై 1937లో బి.ఇడి. పూర్తి చేశారు.గుడిసెలు కాలిపోతున్నాయ్ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. 2001లో భార త ప్రభుత్వం భీమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. 2005 డిసెంబరు 16న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.

1911 సెప్టెంబరు 19 న తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో ఓ హరిజన కుటుంబంలో పుట్టారు.ఇతని తండ్రి పుల్లయ్య, తల్లి నాగమ్మ. వీరికి పంచపాండవుల వలె ఐదుగురు మగపిల్లలు,, ఒక ఆడపిల్ల జన్మించారు. పుల్లయ్య తన మగపిల్లలకు వరుసగా ధర్మరాజు, భీమన్న, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే పేర్లు పెట్టారు.భీమన్న 1935లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణుడై 1937లో బి.ఇడి. పూర్తి చేశాడు. గుడిసెలు కాలిపోతున్నాయ్ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. 2001లో భార త ప్రభుత్వం భీమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.  ఈయన సుమారు 70 పుస్తకాలు రాశారు.పద్య, గేయ, వచన రచనలతో పాటు, నాటకాలను కూడా వ్రాశారు. వివిధ పుస్తకాలకు వ్రాసుకున్న పీఠికల్లో పరిశోధనాత్మక దృష్టి కనిపిస్తుంది. వాటిలో కొన్నేవో కొత్తప్రతిపాదనల్ని, కొత్త సిద్ధాంతాల్నీ చెప్తున్నట్లుంటుంది. ఆకాశవాణిలో ప్రసారం కోసం అనేక భావగీతాల్ని వ్రాశారు. వీటన్నింటితో పాటు అంబేడ్కర్‌ వ్రాసిన కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించడంతో పాటు, ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ రాశారు.వీరు వ్రాసిన ‘జయ జయ జయ అంబేడ్కర!’ దళితులకు జాతీయగేయమై నేటికీ ఊరూరా ప్రార్థనా గీతంగా మార్మోగుతోంది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు డా. బోయి భీమన్న పేరుతో ఒక సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేసి, వీరి రచనలన్నింటినీ ప్రచురిస్తున్నారు. నిజానికివన్నీ విశ్లేషిస్తే గాని, భీమన్న సమగ్ర సాహిత్య దృక్పథం స్పష్టం కాదు. ఈయనే కాదు, ఏ రచయిత దృక్పథాన్నైనా అంచనా వేయాలంటే, వివిధ పరిణామాలుగా సాగిన రచనలన్నింటినీ స్పృశించగలిగినపుడే ఇది సాధ్యమవుతుంది. అలా కాకుండా, దళిత పదాన్ని ప్రయోగించలేదనీ, దాన్ని వ్యతిరేకించాడనీ, భారతదేశంలో కులం లేదన్నాడనీ, ఆయన వర్గాన్నే సమర్ధించాడనీ, కులం గురించి వ్రాయలేదనీ వక్రీకరించే వాళ్లని చూసిన తర్వాత ఆయన సాహిత్యదృక్పథాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఇప్పటికే అనేకమంది భీమన్న రచనలపై పరిశోధనలు చేశారు. రాష్ర్టవ్యాప్తంగా జాతీయ సదస్సులు జరుగు తున్నాయి. వీటన్నింటికీ ఒక మార్గదర్శనాన్ని కల్గించిన గ్రంథం ఒకటి ఉంది. అది హైమావతి చక్కని కథనాత్మక శైలిలో వ్రాసిన ‘‘పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయిభీమన్న’’ గ్రంథం. ఇది వీరి సాహిత్య దృక్పథాన్ని తెలిపే చుక్కానిలాంటిది. దానిలోని సూచనల్ని గమనిస్తే, ఆయన వ్రాసిన రచనల్లో పరిశోధకులకు, విమర్శకులకు తమదైన విశ్లేషణకు ప్రేరణ దొరుకుతుంది. భారతదేశంలోని ‘భిన్నత్వంలోని ఏకత్వం’ లాగే, భీమన్న రచనల్లోనూ ఆ లక్షణం కనిపిస్తుందనీ, ఆయన కుల, మతాల కంటే మానవత్వాన్నే ఆశించిన జాతీయవాది అనీ ఆ గ్రంథం ప్రతిపాదిస్తుంది. భారతజాతీయదృక్పథంలో అంతర్భాగంగా ప్రవహించే హిందూమతంలో కులాన్ని ప్రత్యేకంగా విశ్లేషించు కోవాలి. అంబేడ్కర్‌ విశ్లేషించిందీ, భీమన్న వ్రాసిందీ అదే! తన జీవితాంతం ఆయన జాతీయవాదిగానే ఉన్నాడు. జాతీయతలో తాను పుట్టి పెరిగిన దేశీయవాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే, ఆత్మగౌరవంతో జీవించాలనే ఆకాంక్ష ఉంటుంది. ఒకప్పుడు ‘బ్రాహ్మణ’ శబ్దాన్ని చదువుకున్నవాళ్ళనీ, ఆలోచనాపరుల్నీ సూచించడానికి ప్రయోగించారు. సామాజిక నిర్మాణంలో చాతుర్వర్ణ వ్యవస్థలోకి చేరిన తర్వాత కుల సూచికగా మారిపోయింది. తమ తెలివితేటలతో ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు, క్రమేపీ ఒక వర్గంగా తయారయ్యారు. ఈ ఆలోచనాపరులు ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్ని మతమని ప్రబోధిస్తూనే, ఆచార, వ్యవహారాల పేరుతో, కర్మ సిద్ధాంతం వైపు నడిపించుకొనిపోయిన హిందూమతం పైనే డా. అంబేడ్కర్‌ ముందుగా తన దృష్టిని కేంద్రీకరించాడు. కొన్ని వందలసంవత్సరాలుగా పాతుకుపోయిన హిందూమతంతో అవినాభావసంబంధాన్ని కలిగి ఉన్న వాళ్ళు, తమకు బోధించిన ధర్మశాస్త్రాల వల్ల మానసికంగా, అస్పృశ్యులుగా ఉండిపోవడానికైనా సిద్ధపడతారు. పురాణేతిహాసాలు, సాంప్రదాయ సాహిత్యాల పేరుతో పాలకవర్గాలతో ‘ఆలోచనాపరులు’ కలిసి కొనసాగించిన కుట్ర ఫలితంగా, నేటికీ కులాధిపత్య సాహిత్యమే ఉత్తమసాహిత్యంగా కొనసాగిపోతోంది. దురదృష్టమేమిటంటే, నాటిభావజాలాన్ని నేటికీ కొనసాగించడాన్ని ఆ భావజాలం వల్ల నష్టపోయిన, ఇంకా నష్టపోతున్న వాళ్ళు వ్యతిరేకిస్తుంటే, నాటి ఆధిపత్య భావజాలానికి ప్రతినిధుల్లా వాటిని సమర్ధించేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. అందుకనే తన ప్రజలంతా దేని వల్లనైతే మోసపోతున్నారో, దాన్నుండి రక్షించుకోవడానికి సామాజిక ఉద్యమాన్ని నడిపే బాటలో పయనించిన వాడు అంబేద్కర్‌. అలాంటి ఆశయాన్నే సాహిత్యంలో కొనసాగించిన రచయిత బోయి భీమన్న కూడా! డా. బోయి భీమన్న సమగ్రసాహిత్యం పేరుతో మొదటి సంపుటిని తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇటీవలే విడుదల చేశారు. దీనిలో ‘పాటలలో అంబేద్కర్‌’ (పుటలు : 306- 462 ) ఉంది. దీనిలో అంబేడ్కర్‌ వ్యక్తిత్వాన్ని, భావజాలాన్ని వర్ణించిన 118 పాటలు ఉన్నాయి. 

No comments:

Post a Comment