బిగ్‌బాస్‌ విజేత మృతి !

Telugu Lo Computer
0



బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 13 విజేత, బుల్లితెర నటుడు సిద్ధార్థ్‌ శుక్లా కన్నుమూశారు. ఆకస్మిక గుండెపోటుతో గురువారం ఉదయం 10.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి నిద్రపోయే ముందు అతను కొన్ని మెడిసిన్స్‌​ తీసుకున్నట్లు, ఆ తరువాత మేల్కోలేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.  శుక్లా మరణాన్ని ముంబైలోని కూపర్‌ ఆసుపత్రి ధృవీకరించింది. నిద్రలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సిద్ధార్థ్‌కు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)