టీ20ల్లో కివీస్‌ చెత్త రికార్డు

Telugu Lo Computer
0


న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు టి20 ఫార్మాట్‌లో తొలిసారి బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిపోయింది. ఢాకాలో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ 16.5 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. షకీబ్‌ (2/10), ముస్తఫిజుర్‌ (3/13), నాసుమ్‌ అహ్మద్‌ (2/5), సైఫుద్దీన్‌ (2/7) న్యూజిలాండ్‌ను దెబ్బ తీశారు. టి20ల్లో న్యూజిలాండ్‌కిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం బంగ్లాదేశ్ 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. బంగ్లా టీంలో ముస్తిఫర్ రహీమ్ 16, మహ్మదుల్లా 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మరో వికెట్ పడకుండా విజయం సాధించారు. కాగా ఈ సిరీస్ కోసం, న్యూజిలాండ్ జట్టు 10 మంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)