నరేంద్ర గిరి మృతి కేసు సిబిఐకి అప్పగింత

Telugu Lo Computer
0

 

అఖిల భారతీయ అఖారా పరిషద్‌ చీఫ్‌ మహంత్‌ నరేంద్ర గిరి మృతి కేసును ఉత్తరప్రదేశ్‌ పోలీసుల నుండి సిబిఐ తన ఆధీనంలోకి తీసుకుంది. వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నరేంద్ర గిరి సోమవారం భాగంబరీ గద్దీ మఠంలోని ఆయన గదిలో అనుమానస్పదంగా చనిపోయి కనిపించారు. ప్రాథమిక శవపరీక్షలో ఆయన ఉరివేసుకోవడంతో ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సిఫార్సు మేరకు ఈ కేసు సిబిఐకి అప్పగించగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. యుపి పోలీసులు విచారణ చేపట్టిన దాని ప్రకారం 72 ఏళ్ల నరేంద్ర సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆయన రూమ్‌లోకి వెళ్లారు. సాయంత్రం తలుపులు కొట్టినా.. తీయకపోవడంతో అనుమానం వచ్చి, ఫోన్‌ చేయగా.. అన్సర్‌ చేయకపోవడంతో, తలుపులు పగలగొట్టి .. వెళ్లి చూడగా.. ఉరివేసుకుని కనిపించినట్లు పేర్కొన్నారు. కాగా, గదిలో సూసైట్‌ నోట్‌ ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, ఈ కేసులో సందీప్‌ తివారీతో పాటు ఇద్దరు శిష్యులను అరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)