డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల... - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 28 September 2021

డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల...


ఈ హాస్పిటల్ లో OP కార్డు Rs.300/- కాదు కేవలం Rs.50/-లు మాత్రమే.. ఈ హాస్పిటల్ లో ఒక్క రక్త పరీక్ష ఫీజు రూ.1000/- లు కాదు కేవలం రూ.110/-లు మాత్రమే... ఈ హాస్పిటల్ లో మొత్తం మెడిసిన్ ఖర్చు Rs.7000/-లు కాదు కేవలం Rs.722.50పైసలు మాత్రమే... ఇవన్నీ ఎక్కడో చిన్న హాస్పిటల్ లో కాదు... నెల్లూరు జిల్లాలో అతిపెద్ద హాస్పిటల్స్ లో ఒక్కటైన డాక్టర్_రామచంద్రారెడ్డి_ ప్రజావైద్యశాల...

#PeoplesPolyClinic (#PPC)

ప్రస్తుతం రాష్ట్రంలోనే  పేదవారికి ఆరోగ్యనిలయంగా ఉన్నది. వైద్యం పేదవారికి భారంగా మారిన ఈ రోజుల్లో కేవలం రూ.50/-లతో OP చూసి,అత్యంత తక్కువ ధరలకే మందులు పంపిణీ చేస్తూ పేద వారికి ఆరోగ్య నిలయంగా మారింది డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల.... 1953లో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో అన్ని రకాల చికిత్సల వైద్య నిపుణులు, 24గంటలు అందుబాటులో ఉండే సీనియర్ డాక్టర్స్... కార్పొరేట్ హాస్పిటల్ ని తలపించే సదుపాయాలు... సుమారు 300మంది డాక్టర్లను సమాజసేవకు అందించిన హాస్పిటల్... కమ్యూనిస్టు విప్లవయోధుడు కామ్రేడ్.పుచ్చలపల్లి సుందరయ్య గారి సూచనలు మేరకు వైద్య వృత్తి చేప్పట్టిన ఆయన సోదరుడైన శ్రీ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు పేద ప్రజలకోసం #1953లో స్థాపించిన ఈ ప్రజావైద్యశాల నేడు ప్రజల మన్ననలను పొందుతూ, పేదవారికి ఎంతో ఉపయోగంగా మారింది... 

ఒక పేషెంట్ చెప్పిన స్వీయ అనుభవం

డెంగీ జ్వరంతో బాధపడిన నేను చాలా సీరియస్ కండిషన్ లో ఈనెల 8వ తేదీన డా.రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలలో చేరాను.. 4రోజులు హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్న నేను...

కేవలం రూ.852.50/-పై.లతో డెంగ్యూ జ్వరాన్ని తగ్గించుకున్నాను. మొదటిరోజు డాక్టర్ కన్సల్టెషన్ ఫీజు రూ.50/-లు.. పేరు నమోదు చేసుకోవడానికి రూ.20/-లు.. హాస్పిటల్ లో అడ్మిషన్ చార్జీలు రూ.60/-లు... 4రోజుల్లో మెడిసిన్ కి నాకు అయిన అత్యధిక ఖర్చు రూ.296.50/-పై.లు...అత్యల్పం రూ.9.50/-పై.లు రక్త పరీక్షలకు అత్యధిక ఖర్చు రూ.620/-లు...

(అత్యంత ప్రమాదకరమైన డెంగ్యూ జ్వరాన్ని పూర్తిగా తగ్గించుకోవడానికి  ఒక సాధారణ వ్యక్తికి డాక్టర్. రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలలో మాత్రమే అయ్యే పూర్తి ఖర్చు కేవలం సుమారు రూ.3,032.50పైసలు మాత్రమే)

నేను అడ్మిట్ అయిన ఆ 4రోజులూ ఆ హాస్పిటల్ లో పేద,మధ్యతరగతి కుటుంబాలు వైద్యం కోసం ఎంత ఆరాట పడుతున్నారో...కార్పొరేట్,ప్రయివేట్ హాస్పిటల్స్ వారిని ఎంతలా దోచుకుంటున్నారో స్పష్టంగా కనిపించింది... ప్రజల బలహీనత వైద్యం...ఆ బలహీనతలని కొన్ని కార్పొరేట్,ప్రయివేట్ హాస్పిటల్స్  ఆర్ధికంగా దోచుకొని ఉపయోగించుకుంటున్నాయి...

వారికి అండగా ప్రభుత్వాలు పేదలకు ఉచితం వైద్యం అందించకుండా ఆరోగ్య శ్రీ పథకాలు పేరుతో ఆ కార్పొరేట్,ప్రయివేట్ హాస్పిటల్స్ కి మరింతగా దోచిపెడుతున్నారు...

అత్యంత ఖరీదైన వైద్యాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందించే ఈ హాస్పిటల్ కమ్యూనిస్టుయోధుడు కామ్రేడ్.పుచ్చలపల్లి సుందరయ్య గారి స్వయానా సోదరుడు కామ్రేడ్.డా.రామచంద్రారెడ్డి గారు ప్రజావైద్యశాల పేరుతో ప్రారంభించారు.... 1953లొనే ప్రజల వైద్యావసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజావైద్యశాలను స్థాపించిన #కామ్రేడ్_పుచ్చలపల్లి_సుందరయ్య గారికి, కామ్రేడ్_డా_పుచ్చలపల్లి_రామచంద్రారెడ్డి గారికి విప్లవజోహార్లు...

No comments:

Post a Comment