డిస్నీ ల్యాండ్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 28 September 2021

డిస్నీ ల్యాండ్

 

డిస్నీ ల్యాండ్ సంస్ధ అమెరికా దేశానిది  . వాళ్ళు డిస్నీ ల్యాండ్ లాంటిదే  ఒకటి చైనాలో కట్టి తరిద్దాము అనుకొని వండర్ ల్యాండ్ అనే ఎమ్యూజుమెంట్ పార్క్ ని కట్టడం  మొదలెట్టారు డిస్నీ వారు  . చైనా  వారు చట్టపరంగా భూమిని డిస్నీ వాళ్లకు దాఖలు పరిచారు .  ఈ  పార్కు చైనా దేశపు రాజధాని బీజింగుకు ముప్పై రొండు కిలోమీటర్ల దూరంలోను నూట ఇరవై ఎకరాల స్థలంలోనూ నిర్మించటం మొదలెట్టారు . నిర్మాణం మొదలైనాక  1998  లో ఒకసారి - చైనావారు అడ్డం తిరిగి ఆ పార్కు నిర్మానాన్ని , ఆపించారు . 2008 దాకా ఆశతో ఎదురు చూసిన డిస్నీ వారు ఆ తరువాత ఆశ వదులుకున్నారు  . ఈలోపు డిస్నీ ఎంతో పెట్టుబడి పెట్టి  భూమిని చదును చేయటం . వివిధ కట్టడాలు కట్టడం  చేసింది . మీరు మా సంస్కృతిని నాశనం చేస్తున్నారు - వెళ్లిపోండి అని చైనా వారు డిస్నీ ని గెంటి వేసింది . ఇప్పుడు చూడండి చైనా తెలివి  తన  భూమిని పైసా  ఖర్చులేకుండా  డెవలప్ చేయించుకుంది . భూమి డెవలప్ మెంట్ అయ్యేటప్పటికి రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చి వాళ్ల జనం బాగుపడ్డారు . డిస్నీ వారిచే  పాడు పెట్ట బడిన ఆ ప్రదేశంలో కరెంటు నీరు టాయిలెట్ వంటి సౌకర్యాలు వుండవు.   కట్టడాలు మాత్రం అలాగే వున్నాయి  .  ఆ భూమి మీద ఏమి జరిగినా దానికి భాద్యత డిస్నీ వారిదే . అందుకని వారు " ఇక్కడ జరిగే ప్రమాదాలకు దొంగతనాలకు మా భాద్యత లేదు " అని బోర్డులు పెట్టి పక్కకు తప్పుకున్నారు . దానితో ఫ్రీ ఆఫ్ ఛార్జీగా ( డబ్బులు లేకుండా ) ప్రజలు దాన్ని సందర్శించి ఫోటోలు దిగి - సంతోషించటం ( ఎమ్యూసిమెంట్ ) ఫీల్ అవటం మొదలెట్టారు .  సినిమా షూటింగ్లు/ టీవీ షూటింగులకు కూడా దీన్ని ఫ్రీ గా వాడేసుకుంటూ ఇంకా లభ్ది పొందారు . పగటి  పూట ప్రజలు వస్తూ ఉండటం వల్ల -  కొందరు బయలు దేరి కారు/స్కూటర్ పార్కింగ్ స్టాండ్ లు పెట్టి - ఎంతో కొంత సంపాదించుకుని లభ్ది పొంద సాగారు . వాళ్ల మీద ఎమన్నా చర్య తీసుకుంటే - లాండు మీద భాద్యత మాది అని చెప్పుకున్నట్లు అవుతుంది అని మరియు  డిసినీని చైనా వెళ్లగొట్టినట్లు సాక్ష్యం తయారు అవుతుందని భావించిన చైనా తనకేమీ పట్టనట్లు ఊరుకుంది. పగలు సంగతి ముగిసింది కదా అనుకుంటే చైనా వాళ్ళు రాత్రిని కూడా వదలలేదు . కార్లు , లారీల ఓనర్లు - రాత్రి పూట తమ పెద్ద పెద్ద వాహనాలను ఇక్కడికి చేర్చి - చేయాల్సిన రిపైర్స్ అన్నీ ఇక్కడే చేసుకొని  -  తెల్లవారేటప్పటికి రోడ్ల మీదకు  వెళ్లి పోవటం మొదలెట్టారు . వీళ్లూ లభ్ది పొందారు .  ఎన్ని మాటలు ఆడినా - ఎన్ని వప్పందాలు చేసుకున్నా - ఎన్ని స్నేహాలు చేసినా - చైనా వాళ్ళు తమ సొంత లాభం చూసుకుంటారు . 

No comments:

Post a Comment