పెరగనున్న డ్రై ఫ్రూట్స్ ధరలు

Telugu Lo Computer
0

కరోనా వైరస్ దెబ్బకి ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు మరో ఝలక్ తగలనుంది. ఎల్‌పీజీ సిలిండర్, పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుతో ఇబ్బందులు పడుతున్న జనాలపై మళ్లీ ధరల పెంపు ప్రభావం పడబోతోంది. దీంతో పండుగ సీజన్‌లో చాలా మందిపై ప్రభావం పడొచ్చు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల దేశంలో డ్రై ఫ్రూట్స్ ధరలు పెరగొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. భారత్ అమెరికా నుంచి బాదం పప్పులు ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇప్పుడు దిగుమతులు తగ్గాయి. ఎండు ద్రాక్షను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ దిగుమతులు కూడా ఆగిపోయాయి. దీంతో దేశంలో డ్రై ఫ్రూట్స్ ధరలు పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. దీని వల్ల పండుగ సీజన్‌లో చాలా మందిపై ప్రభావం పడొచ్చు. అయితే జీడి పప్పు ధరలు మాత్రం ఎక్కువగా పెరగకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే మన దేశంలో కూడా జీడి పప్పును ఎక్కువగా సాగు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)