చిన్నారులపై డెంగీ పంజా

Telugu Lo Computer
0


తెలంగాణ వ్యాప్తంగా డెంగీ విజృంభిస్తోంది. ముఖ్యంగా చిన్నారులపై పంజా విసురుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ  డెంగీ బాధితులతో నిండిపోతున్నాయి. నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులన్ని ఇన్, ఔట్ పేషెంట్స్ తో నిండిపోతున్నాయి. నిలోఫర్‌లో చిన్నపిల్లల యూనిట్లు చిన్నారులతో నిండిపోయాయి. నిత్యం వెయ్యి మందికి తక్కువ కాకుండా ఓపీ ఉంటోంది. గాంధీ ఆసుపత్రిలోనూ డెంగీతో చిన్నారులు చేరుతున్నారు. అటు చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాస్త జ్వరమున్న నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు. పిల్లల్లో డెంగ్యూతో పాటు మలేరియా, టైఫాయిడ్, చికెన్ ఫాక్స్ కూడా వస్తున్నాయని చెప్పారు. వీటన్నిటితో పాటు కరోనా భయం కూడా ఉంది కాబట్టి నిర్లక్ష్యం తగదని వైద్యాధికారులు అంటున్నారు. పిహెచ్ సి  మొదలుకొని పెద్దాసుపత్రి వరకు మెరుగైన వైద్యం అందించడం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇటు హైదరాబాద్‌లోనే డెంగీ కేసులు అత్యధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్‌లోనే డెంగీ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)