గులాబ్‌ ఎఫెక్ట్‌కి పలు రైళ్లు రద్దు

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుఫాను కారణంగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను  దారి మళ్లించింది. ఆదివారం భువనేశ్వర్‌ – సికింద్రాబాద్‌, భువనేశ్వర్‌ – తిరుపతి మధ్య నడువాల్సిన రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. అలాగే పూరీ – చెన్నై సెంట్రల్‌, సంబల్‌పూర్‌ – హెచ్‌ఎస్‌ నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌, రాయగడ – గుంటూరు ఎక్స్‌పెక్స్‌, భువనేశ్వర్‌ – కేఎస్‌ఆర్‌ బెంగళూరు సిటీ, భువనేశ్వర్‌ – యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లను రద్దు చేసింది. సోమవారం నడువాల్సిన తిరుపతి – భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై సెంట్రల్‌ – పూరీ ఎక్స్‌ప్రెస్‌, హెచ్‌ఎస్‌ నాందేడ్‌ – సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, కేఎస్‌ఆర్‌ బెంగళూరు సిటీ – భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌, యశ్వంత్‌పూర్‌ – భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను సైతం రద్దు చేసింది. గులాబ్‌ తుఫాను కారణంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఏపీ, ఒడిశాలో వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ సైతం జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)