యూరినరీ ఇన్ఫెక్షన్లకు ఇంటి వైద్యం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 30 September 2021

యూరినరీ ఇన్ఫెక్షన్లకు ఇంటి వైద్యం


యూరినరీ ఇన్ఫెక్షన్ ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. వైద్యుని దగ్గరకు వెళితే యాంటీబయాటిక్స్‌ ఇస్తారు. దాంతో అప్పుడు తగ్గినట్లు అనిపించినా మళ్లీ వస్తుంటుంది ఒక్కోసారి. ఇన్‌ఫెక్షన్ తగ్గేందుకు చికిత్స పొందుతున్నప్పటికీ, మళ్లీ సంభవించకుండా నిరోధించడానికి సహాయపడే అనేక గృహ నివారణలు కూడా అందుబాటులో ఉన్నాయి. అసలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) మూత్రపిండాలు, యుటెరస్, మూత్రాశయం లేదా మూత్ర నాళాన్ని ప్రభావితం చేస్తాయి. మూత్ర విసర్జన చేసినప్పుడు మండుతున్న అనుభూతి తరచుగా మూత్ర విసర్జన మూత్రం ముదురు రంగులో ఉంటుంది. తీవ్రమైన వాసనతో మూత్రం బొట్టు బొట్టుగా రావడం కటి భాగంలో నొప్పి మూత్రాశయంలో మంట, నొప్పి వంటివి అటు పురుషులకి, ఇటు స్త్రీలకి కూడా వస్తాయి. కానీ మహిళలు ఎక్కువగా మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ఎందుకంటే మూత్రాశయం నుండి మూత్రాన్ని బయటకు తీసుకెళ్లే ట్యూబ్ పురుషుల కంటే మహిళల్లో తక్కువగా ఉంటుంది. ఇది మూత్రాశయంలోకి బ్యాక్టీరియాప్రవేశించేందుకు అనువుగా ఉంటుంది. వాస్తవానికి, దాదాపు సగం మంది మహిళలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో మూత్ర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. మూత్ర నాళానికి సంబంధించిన వ్యాధుల నుండి రక్షించడానికి, ప్రమాద తీవ్రతను తగ్గించడానికి అనేక సహజ మార్గాలు కూడా ఉన్నాయి. ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. మంచినీళ్లు, పండ్లరసాలు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మూత్ర నాళంలో ఇరుక్కున్న బ్యాక్టీరియా నీటి ద్వారా బయటకు వచ్చేందుకు సహాయపడుతుంది.  విటమిన్ సి తీసుకోవడం పెంచడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుందని కొన్ని ఆధారాలు చూపిస్తున్నాయి. విటమిన్ సి మూత్రం యొక్క ఆమ్లతను పెంచుతుందని భావిస్తారు. తద్వారా ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది. పండ్లు మరియు కూరగాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఎర్ర మిరియాలు, నారింజ, ద్రాక్షపండు, కివిఫ్రూట్ వీటన్నింటిలో విటమిన్ సి ఉంటుంది. క్రాన్బెర్రీ జ్యూస్ క్రాన్బెర్రీ జ్యూస్ మూత్ర మార్గ సమస్యలకు సహజ నివారణిగా పని చేస్తుంది. ఈ పండు మూత్ర నాళానికి బ్యాక్టీరియా అంటుకోకుండా నిరోధిస్తుంది.  పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాలలో ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రోబయోటిక్స్‌లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది యాంటీ బయాటిక్ వాడకంతో కలిగే దుష్ప్రభావాలను తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారించడం కొన్ని బాత్రూమ్ అలవాట్లను ఆచరించడం ద్వారా మొదలవుతుంది. ముందుగా, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం చేయకూడదు. ఇలా చేయడం వలన బ్యాక్టీరియా మూత్రనాళంలో పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. లైంగిక సంపర్కం తర్వాత మూత్ర విసర్జన చేయడంతో పాటు ఆ భాగాన్ని నీటితో శుభ్రంగా కడగడం వంటివి చేయడం ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తిని నివారించవచ్చు. వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. రోజుకి రెండు వెల్లుల్లి రెబ్బలను పొట్టు వలిచి వేడి అన్నం మీద పెడితే ఉడికి నట్లవుతుంది. వీటిని తింటూ ఉంటే సమస్య తీవ్రత తగ్గుతుంది. 

No comments:

Post a Comment