వారానికొకసారి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి

Telugu Lo Computer
0

 


మొబైల్ వాడకం ఎంతలా పెరిగిపోతుందో.. మొబైల్ హ్యాక్ చేయడం లాంటి నేరాలు కూడా అంతే పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఏదో ఒక విధంగా సైబర్ నేరగాళ్లు మొబైల్ ని హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో మొబైల్స్ వాడకం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎంతో కీలకమైన సమాచారాన్ని కూడా చరవాణిలో భద్రపరచడానికి అందరూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఏటీఎం కార్డు పిన్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లను,ఆధార్ కార్డు పాన్ కార్డు సహా మిగతా కొన్ని రకాల డాక్యుమెంట్లను కూడా మొబైల్లో భద్రపరచడం లాంటివి చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక హాకర్లు కూడా రెచ్చిపోతూ మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేస్తూ ఏకంగా కీలక సమాచారాన్ని దొంగలిస్తున్నారు. అయితే హ్యాకర్ల చేతికి మొబైల్ చిక్కకుండా ఉండాలి అంటే ఇటీవలే అమెరికా జాతీయ భద్రతా సంస్థ ఒక సూచన చేసింది. లాప్టాప్ సరిగ్గా పని చేయనప్పుడు లేదా స్లో గా ఉన్నప్పుడు సిస్టమ్ ఆఫ్ చేసి ఆన్ చేయడం లాంటివి చేస్తారు. అలాగే మొబైల్ ని కూడా వారానికి ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఎంతో మంచిది అంటున్నారు. ఇక తరచూ చేసినా కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త పడొద్దు అని సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)