పెంపుడు జంతువు ఉంటే అద్దె అదనం

Telugu Lo Computer
0


పెంపుడు జంతువు ఉంటే అదనపు అద్దె చెల్లించాలని ఒక యజమాని వింత షరతు విధించాడు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పెంపుడు జంతువుల యజమానులకు అద్దె ఇంటి కష్టాలు తీర్చేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో కొత్త మోడల్ అద్దె ఒప్పందాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పెంపుడు జంతువులను అద్దె ఇండ్లలోకి యజమానులు నిషేధించలేరని పేర్కొంది. ఈ కొత్త నిబంధన ప్రకారం పెంపుడు జంతువులకు సంబంధించిన సమ్మతి ఒప్పందంలో డిఫాల్ట్‌గా ఉంటుంది. అయితే అద్దెకున్న వ్యక్తి పెంపుడు జంతువు కోసం అభ్యర్థిస్తే యజమాని తన అభ్యంతరంపై కారణాన్ని 28 రోజుల్లో లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. ఈ నిబంధన నేపథ్యంలో ఒక యజయాని వినూత్నంగా షరతు విధించాడు. పెంపుడు జంతువుల కోసం అదనపు అద్దె చెల్లించాలని ఒప్పందంలో పేర్కొన్నాడు. పంజరంలో పెంచే పక్షులు, గార్డెన్‌లో పెంచే పందులకు నెలకు పది పౌండ్లు (రూ.1018) , ఇంట్లో స్వేచ్ఛగా తిరిగే కుక్క, పిల్లి, కుందేలు వంటి వాటి కోసం నెలకు 25 పౌండ్ల (రూ.2,542)ను అదనంగా చెల్లించాలన్న నిబంధన పెట్టాడు. పెంపుడు జంతువులకు అదనపు అద్దె చెల్లించాలన్న ఈ షరతు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. చాలా దారుణమని కొందరు నెటిజన్లు విమర్శించారు. అయితే, పెంపుడు జంతువులు ఉన్నవారికి అద్దెకు ఇల్లు లభించని తరుణంలో ఇది సమంజసమేనని మరి కొందరు సమర్థించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)