భీమశంకర జ్యోతర్లింగా ఆలయం

Telugu Lo Computer
0

 

భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆరొవది. భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహారాష్ట్రలో పూణేకు 127 కి.మీ. దూరంలో, పూణే జిల్లాలోని ఖేడ్ తాలుకాలో భీమా నది ప్రక్కన భావగిరి గ్రామంలో వెలసి ఉంది.

పూర్వం భీముడనే పిలువబడే ఈ రాక్షసుడు తన తల్లి కర్కటితో ఈ పర్వత శిఖరం పైన నివసిస్తూ ఉండేవాడు. ఒక రోజున భీమాసురుడు తన తన తల్లిని నా తండ్రి ఎవరు అని అడిగాడు మరియు అతను ఎక్కడ ఉన్నాడో నా జన్మ  వృత్తాంతం చెప్పవలసింది అని కోరాడు.  దానికి ఆ రక్కసి  కర్కటుడు అనే రాక్షసుడు నా తండ్రి. పుష్కన్ నా తల్లి, నన్ను విరాధుడు అనే దానవుడికి ఇచ్చి వివాహం చేశారు. శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు అతను నా భర్తను చంపాడు. అప్పటి నుండి నా తల్లిదండ్రులైన పుష్కసి-కర్కటుల దగ్గర నివసిస్తున్నాను. అప్పుడు ఒక రోజు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణ నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నీవు జన్మించావు. ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్యమహర్షి శిష్యుడైన సుతీక్ష్ణుడు అనేవాడిని తినబోయారు. తపస్సంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేశాడు. అది విన్న భీముడు అందరు రాక్షసుల మాదిరిగా విష్ణువును ద్వేషించడం మొదలుపెట్టాడు, బ్రహ్మ కోసం తపస్సుచేసి వరాలను పొంది దేవతలను, ఋషులను, సాధువులను, సజ్జనులను వేధించడం ప్రారంభించాడు. గొప్పశివ భక్తుడైన కామరూప దేశాధిపతిని,  రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని,  భార్య దక్షిణా దేవిని కారాగారంలో బంధించాడు.  వారు జైలులో మట్టితో ఒక లింగం తయారుచేసి   ప్రాణప్రతిష్ఠ చేస్తారు మరియు మానసిక ఆరాధన ప్రారంభిస్తారు.  ఇంద్రాది దేవతలు కూడా విధి మాధవులను ముందుంచుకొని  భీమాసురుడిని సంహరించి లోకాలను రక్షించమని పరమేశ్వరున్ని వేడుకొన్నారు. శంకరుడు వారికి అభయాన్నిచ్చి పంపించి తన భక్తులైన కామరూప దేశ రాజదంపతులను రక్షించటం కోసం అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇంతలో, కామరూప రాజా తనను లొంగదీసుకోవడానికి కొంత మంత్ర విద్య చేస్తున్నాడని విన్న భీమాసురుడు అతన్ని చంపడానికి అక్కడకు వచ్చాడు అప్పుడు అయన ముందున్న పార్థివ లింగాన్ని కత్తితో నరకటానికి సిద్ధపడే సరికి పరమేశ్వరుడు  ప్రత్యక్షమై భీమాసురున్నీ అతని సైన్యాన్ని తన క్రోధాగ్ని జ్వాలలచే దహించాడు. అక్కడ అనేక సిద్ధులను ఇచ్చే ఓషధులు పుట్టాయి. ఆ భస్మకు అనేక మహిమలున్నాయి. ఆ భస్మను ధరిస్తే భూత ప్రేత పిశాచాదుల బాధ ఉండదు. ఎలాటి రోగాలైనా నయమవుతాయి. ఇప్పటికి ఆ ప్రాంత ప్రజలు శివాగ్ని సంపర్క జనితమైన వనౌషధులను, భస్మను ఉపయోగించుకొని అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. నారదాది మునులు ఇతర ఋషులు, దేవతలు ప్రార్థింపగా శంకరుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడ స్థిరంగా నెలకొని ఉన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)