ఆటోపై కూలిన చెట్టు

Telugu Lo Computer
0


ఆటోలో కూర్చొని ఉన్న ఐదేళ్ల పిల్లాడిపై మృత్యువు ఒక చెట్టు రూపంలో దాడి చేసింది. అతను ఉన్న ఆటోపై పక్కనే ఉన్న ఒక చెట్టు విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఆ బాలుడి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాలుడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ బాలుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ప్రమాదం దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. ఇక్కడి ఐపీ ఎక్స్‌టెన్షన్ ఏరియాలో ఆటోలో ఆ బాలుడు ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. తలకు తీవ్రగాయాలతో ఉన్న అతన్ని దగ్గరలో ఉన్న శాంతి ముకంద్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స తీసుకుంటూ ఆ పిల్లాడు కన్నుమూశాడు. తలకు తగిలిన తీవ్రమైన గాయాలవల్లే బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ విరిగిన జెట్టుతోపాటు ఆటోకు సంబంధించిన కొన్ని అద్దం ముక్కలు కూడా కనిపించాయి. నిపుణులు ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారని పోలీసులు తెలిపారు. ప్రమాదం యాదృచ్ఛికంగానే జరిగినట్లు కనిపిస్తోందని, ఎవరి వల్లో జరిగినట్లు ఎటువంటి ఆధారాలూ లభించలేదని చెప్పారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)