అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసిన మణిపాల్ హాస్పిటల్స్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 17 September 2021

అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసిన మణిపాల్ హాస్పిటల్స్

 ఆస్టియోపెట్రోసిస్‌ లేదా అల్బర్స్‌-స్కాన్‌బెర్గ్‌గా వ్యవహరించే అత్యంత అరుదైన జన్యు వ్యాధి తో బాధపడుతున్న 15 సంవత్సరాల బాలుడు కె హర్షవర్ధన్‌కు మణిపాల్‌ హాస్పిటల్స్‌ లో


విజయవంతంగా చికిత్సనందించారు.  హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ ''ఇది అత్యంత అరుదైన వ్యాధి. దాదాపు 5లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇది కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యాధికి చికిత్స చేయడం ఇదే తొలిసారి. అత్యంత విజయవంతంగా ఈ శస్త్ర చికిత్స చేయడంతో పాటుగా రోగి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచిన డాక్టర్‌ వీవీకె సందీప్‌, అతని బృందాన్ని అభినందిస్తున్నాను. మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ వద్ద ఎలాంటి ఆరోగ్య సమస్య లేదా తీవ్ర అనారోగ్య స్థితికి అయినా సరే చికిత్సనందించే అన్ని రకాల సదుపాయాలూ ఉన్నాయి. తద్వారా ఈ తరహా చికిత్సల కోసం రోగులు సుదూర ప్రాంతాలకు పయణించవలసిన అవసరం లేదు'' అని అన్నారు

హర్ష వర్థన్‌ తల్లి వెంకట లక్ష్మి మాట్లాడుతూ ''మా అబ్బాయికి చిన్నతనం నుంచి ఆరోగ్య పరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. తరచుగా తలనొప్పి అని చెబుతుండేవాడు. చెవి నుంచి చీము కారుతుండేది. దీనికి తోడు ముక్కు కూడా ఎప్పుడూ కారుతూనే ఉండేది. మేము ఈ సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ఎన్నో హాస్పటల్స్‌ తిరిగాము కానీ సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. మేము డాక్టర్‌ రవికాంత్‌ను కలిసి నప్పుడు ఆయన మాకు డాక్టర్‌ సందీప్‌ను కలువాల్సిందిగా సూచించారు. ఆయన ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. మా అబ్బాయి ని కాపాడటంతో పాటుగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దిన డాక్టర్‌ సందీప్‌కు మణిపాల్‌ హాస్పిటల్స్‌ డాక్టర్లకు మేమెప్పుడూ ఋణపడిఉంటాము'' అని అన్నారు. డాకర్ల బృందంలో కన్సల్టెంట్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ కూడా ఉన్నారు. ఈ బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. అవసరమైన పరీక్షలు చేసిన తరువాత అతనిని డిశ్చార్జ్‌ చేశాము. రాబోయే కొద్ది రోజులు ఈ బాలుడిని డాక్టర్లు పర్యవేక్షించనున్నారు.

No comments:

Post a Comment

Post Top Ad