తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకమయ్యారు. తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో ఛీఫ్ జస్టిస్ లను మారుస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు  సీజే జస్టిస్ హిమా కొహ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. దీంతో ఆమె స్ధానంలో కర్నాటక హైకోర్టు యాక్టింగ్ సీజేగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మను తెలంగాణ సీజేగా కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని ఛత్తీస్ ఘడ్ హైకోర్టుకు మార్చారు. ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా ఇంతవరకూ సేవలందించిన ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ సీజేగా నియమించారు. దేశవ్యాప్తంగా పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు క్రిమినల్ కేసుల వేగవంతానికి ప్రయత్నిస్తున్న సుప్రీంకోర్టు ఈ బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. కొలీజియం సిఫారసు మేరకు ఈ బదిలీలయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)