రూపు మార్చుకుని ముందు కొస్తున్న సినిమా టూరింగ్ టాకీస్ లు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 10 September 2021

రూపు మార్చుకుని ముందు కొస్తున్న సినిమా టూరింగ్ టాకీస్ లు

 


నలబై సంవత్సరాల ముందు వరకు సినిమా చూడాలంటే సినిమా టెంట్లే దిక్కు...మా తిరుపతి లో అయితే కట్టకింద ఊరు...కొర్లగుంట చివర్లో పొలాలు అనుకుని ఉండేది...అలాగే బాలాజీ టాకీస్, మహావీర్ టాకీస్ లు టెంట్లు కు ప్రతిరూపం గా ఉండేవి. తిరుచానూరు గ్రాండ్రిడ్జ్ హోటల్ స్థలంలో చెరువు కట్టకింద ఒక టెంట్, కాలూరు క్రాస్ లో ఒకటి, చంద్ర గిరి లో రెండు, ఏ రంగంపేట లో రెండు టెంట్లు లో సినిమాలు ప్రదర్శించేవాళ్లు....

పావలా నెల టికెట్...

స్క్రీన్ ముందు ఇసుకలో పడుకుని..కూర్చుని ఎలా కావాలంటే అలా సినిమా చూసే సౌకర్యం సినిమా టెంట్ నెల టిక్కెట్ లో నే ఉండేది.  ఆ కిక్కే వేరు..అలా ఇసుకలో పడుకుని మాయాబజార్ సినిమా చూస్తూ నెల్లూరు రమణా రెడ్డి రాక్షస గురువు  వేషం లో కౌరవుల భరతం పట్టేందుకు మంత్ర దండం తిప్పుతూ..ఇమ్ ఇహి.. అం.. అహ.. అంటే పడుకొని సినిమా చూసే వాళ్లు కూడా రమణా రెడ్డి హస్య నటనకు లేచి కూర్చుని ..ఇమ్ ఇహి..అం ఆహా..అని కడుపుబ్బా నవ్వుతూ పెద్ద పెద్దగా కేకలు పెట్టి తామే మాయాబజార్ నెల్లూరు రమణారెడ్డి క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి వంత పాడుతూ మురిసిపోయేవారు..పిలకాయలు అయితే రచ్చ రచ్చ..గోల గోల చేసేవాళ్లు... ఎన్టీఆర్.. ఏఎన్ ఆర్..క్రిష్ణా సినిమాలకు ఈ రచ్చ ఇంకా ఎక్కువగా ఉండేది. చిత్తు కయితాలు చించి స్క్రీన్ ముందర అభిమానులు చల్లేవాళ్లు. బెంచి, కుర్చీ తరగతులు టికెట్లు 75 పైసలు(ముక్కాలు రూపాయ గా ), ఒకటింకాల్ రూపాయ గా వుండే ది.

ఇంటర్వెల్ లో మురుకులు..కలర్ సోడా.. 

పదిపైసలు కి మురుకు అమ్మేవాళ్ళు.  కలర్ గోలి సోడా...పన్నీర్ సోడా..రోజ్ మిల్క్.. పాప్కార్న్.. చిన్న సైజ్  ఆనియన్ సమోసాలు తినుబండారాలు కొనుక్కునేందుకు... ఒకరినొకరు తోసుకుని మరి బయటకు వెళ్ళేవాళ్ళు...ముక్కుపగిలే దుర్వాసన టెంట్ మరుగుదొడ్లు వద్ద ఉచితం... ముక్కులు మూసుకుని బతికితిమిరా దేవుడా అనుకుని ..తిరిగి సినిమాలో లీనమైమయ్యే వాళ్లు..

అలాంటివి 1990 దశకం చివరకు పూర్తిగా ఉనికిని కోల్పోయాయి...

కోవిడ్ నేర్పిన పాఠం తో మళ్ళీ పాత పద్ధతిలో....

కోవిడ్ మహమ్మారి నేర్పిన పాఠం తో  తిరిగి టూరింగ్ టాకీస్ లు..సినిమాటెంట్ లు హైటెక్ రూపంలో ఓపెన్ థియేటర్లు... డ్రైవ్ఇన్ థియోటర్స్ ...ఇలా కొత్త కొత్త హంగులు తో అత్యాధునిక సౌండ్ ఏపేక్ట్లతో ఎకరాల కొద్ది ఆరుబయట స్థలంలో అందుబాటులో కి రానున్నాయి. ఇప్పటికే యూరప్ లో విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ తరహా ఓపెన్ స్క్రీన్ లు నేరుగా కార్లో కూర్చొనే చూసే విధంగా  రానున్నాయి. ఓటి టీ లు ఎన్ని ఉన్నా పెద్ద తెర పెద్ద తెరే....                          -నేతాజీ

No comments:

Post a Comment