ఆశా భోస్లే

Telugu Lo Computer
0


ఆశా భోస్లే (జననం: 1933 సెప్టెంబరు  బాలీవుడ్ గాయని. 1943లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడింది. మరో గాయనియైన లతా మంగేష్కర్కు సోదరి.

సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.

ఆశా భోస్లే మహారాష్ట్రకు చెందిన సాంగ్లి లోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు, గాయకుడు.

పురస్కారాలు 

18వ స్క్రీన్ అవార్డు ఉత్సవాలు 2012.

ఫిలిం ఫేర్ అవార్డ్లు 

ఏడు సార్లు ఫిలిం ఫేర్ ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు, 18 సార్లు నామినేషన్లు 

ఫిలిం ఫేర్ ఉత్తమ నేపధ్యగాయని అవార్డులు 

1968: "గరీబో కి సునో " (దాస్ లాఖ్ , 1966)

1969: "పర్దే మే రెహ్నే దో" (షికార్, 1968)

1972: "పియా తూ అబ్ తో ఆజా " (కారవాన్, 1971)

1973: "దం మారో దం" (హరేరామా హరేకృష్ణ, 1972)

1974: "హోనే లగీ హై రాత్ " (నైనా , 1973)

1975: "చైన్ సే హం కో కభీ " (ప్రాన్ జాయే పర్ వచన్ న జాయే, 1974)

1979: "యే మేరా దిల్ " (డాన్, 1978)

స్పెషల్ అవార్డ్ 

1996 – స్పెషల్ అవార్డ్ (రంగీలా, 1995)

లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ 

2001 – ఫిలిం ఫేర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్

జాతీయ ఫిలిం అవార్డ్లు 

రెండు సార్లు జాతీయ ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు గెలుచుకుంది :

1981: దిల్ చీజ్ క్యా హై (ఉమ్రావ్ జాన్)

1986: మెరా కుచ్ సామాన్ (ఇజాజత్)

IIFA అవార్డు 

బెస్ట్ ఫిమేల్ ప్లేబాక్ సింగర్

2002: "రాధా కైసే న జలే" ( లగాన్)

Post a Comment

0Comments

Post a Comment (0)