పండుగల వేళ జాగ్రత్త!

Telugu Lo Computer
0


కేరళలో కరోనా ఇన్‌ఫెక్షన్లు తగ్గుతున్నట్లు ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ డాక్టర్ బల్‌రామ్ భార్గవ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ఆయన చెప్పారు. అయితే పండుగల సీజన్ ఉన్నందున ప్రజలు భారీ సంఖ్యలో గుమ్మికూడే అవకాశాలు ఉన్నాయని, అలాంటి వాతావరణంలో మళ్లీ వైరస్ ప్రబలే అవకాశాలు ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. అందరూ వ్యాక్సిన్లు తీసుకోవాలని, కోవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించాలని, బాధ్యతాయుతంగా ప్రయాణించాలని, పండుగలను కూడా బాధత్యతో జరుపుకోవాలని బల్‌రామ్ భార్గవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కేసుల్లో కేరళలోనే 68 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. కేరళలో మొత్తం 1.99 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని, మిజోరం, ఏపీ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో పది వేల యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పారు. గడిచిన 11 వారాల నుంచి పాజిటివిటీ రేటు 3 శాతం కన్నా తక్కువగా ఉన్నట్లు రాజేశ్ తెలిపారు. 64 జిల్లాల్లో మాత్రం కోవిడ్ పాజిటివిటీ 5 శాతానికి ఎక్కువగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా 3,631 పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్లాంట్లు కమిషన్ అయిన తర్వాత సుమారు 4500 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)