ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుంటాం

Telugu Lo Computer
0


కరోనా సమయంలో ఎన్నికల కోసం విందుల పేరుతో కళాకారులను ఒక చోట చేర్చి వారి జీవితాలతో చెలగాటమాడొద్దని తాజాగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఓ వీడియోను రీలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ స్పందించారు. కరోనా భయంలో ఎన్ని రోజులు ఇంట్లో కూర్చొని ఉంటామని ఆమె ప్రశ్నించారు. కరోనా నియమాలను పాటిస్తూనే ప్రకాశ్‌ రాజ్‌ సమావేశం జరిగిందన్నారు. కోవిడ్‌ నియమాలను పాటిస్తూ పెళ్లిలు, సభలు, సమావేశాలు జరుగుతున్నాయని, తాము కూడా అవే నియమాలను పాటిస్తూ విందు ఏర్పాటు చేశామని తెలిపారు. బండ్ల గణేశ్‌ ప్రతిసారి తన గురించే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)