అల్లం - ఉపయోగాలు

Telugu Lo Computer
0


అల్లం అందరికీ తెలిసిందే. అల్లాన్ని ఎండబెట్టి శొంఠిని తయారు చేస్తారు. ఆయుర్వేద వైద్యులు దీన్ని మహౌషధి అంటారు. అంటే మహోన్నతమైందని అర్థం. ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక వ్యాధులు నయం చేయడానికి ఉపయోగపడుతుందని మన పూర్వీకులు చెబుతున్నారు. దీనికి కఫదోషం నివారించే గుణం ఉంది. అంటే గొంతులో గరగర, నొప్పి, కఫన్ని తరిమేస్తుంది. అందుకే మన మహర్షులు దీనికి కఫరీ అని పేరు పెట్టారు. శొంఠిలో ముఖ్యంగా ఆకలిని పెంచే గుణం ఉంటుంది. దీనివల్ల ఇతర రుగ్మతలు వస్తాయి. శొంఠిని పాలలో, కషాయం, మజ్జిగలో కలిపి తీసుకోవాలి. నోటిలోని బ్యాక్టిరియాను తరిమేసి, దంతాలను కాపాడుతుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. కాలేయాన్ని కాపాడుతుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. అల్లం తరచూ తినడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. జీర్ణక్రియ, పొట్టలో పుండ్లు, గొంతులో ఇన్ఫెక్షన్‌కు పనిచేస్తుంది. అల్లం చిటికెడు ఉప్పు భోజనానికి ముందు లేదా తర్వాత గానీ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జ్వరం వచ్చినపుడు ఏమీ తినాలని అనిపించదు. అల్లంతో ఆహారం తీసుకుంటే సరిపోతుంది. ఫీవర్‌ తర్వాత రికవరీకి సాయపడుతుంది. వివిధ రకాల నొప్పులకు ఓ దివ్యౌషధం. రుతుక్రమం సరిగ్గా ఉండని మహిళలు అల్లం టీ తాగితే మంచిది. టీలో పచ్చి అల్లాన్ని దంచి టీలో కలుపుకొని తాగితే పైత్యం తగ్గుతుంది. అజీర్తితో బాధపడేవారు అల్లరసం తాగాలి. తరచూ దురదలు వచ్చేవారు అల్లంతో ఏదైనా ద్రావణంలో కలిపి తీసుకుంటే మంచిది. క్రమంతప్పకుండా.. అల్లం తీసుకుంటే కడుపులో కణితిలు ఏర్పడవు. అందుకే అల్లాన్ని ప్రతిరోజూ ఏదోవిధంగా తప్పకుండా ఉపయోగించాలి. ఇందులో ఎన్నో రకాల మినరల్స , విటమిన్స్‌ కూడా ఉన్నాయి. అల్లంతో బరువు తగ్గవచ్చు. అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)