తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్నటి అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయువ్య, పశ్చిమ, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతుందని వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వంపు తిరిగి ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ - వాయువ్య దిశగా ప్రయాణిస్తూ రానున్న 12 గంటల్లో మరింత బలపడి ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరం దగ్గర వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)