రూ.397 కే సంవత్సరం మొత్తం సర్వీస్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 5 September 2021

రూ.397 కే సంవత్సరం మొత్తం సర్వీస్

కేవలం రూ.500 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో సంవత్సరం మొత్తం సర్వీస్ ఆశిస్తున్నారా? అయితే, ప్రభుత్వ టెలికం సంస్థ BSNL యొక్క చవకైన వన్ ఇయర్ ప్లాన్ ను పరిశీలించవచ్చు. ఎందుకంటే, BSNL తన కస్టమర్ల కోసం అతితక్కువ రీఛార్జ్ తో ఎక్కువ వ్యాలిడిటీ మరియు ఉచిత డేటా అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేసే బెస్ట్ రీఛార్జ్ అఫర్ చేస్తోంది. BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే పూర్తి సంవత్సరం వ్యాలిడిటీ అందుతుంది. ఈ ప్లాన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కగడితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది.

ఈ అఫర్ ముందు నుండే అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లతో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా ఒక సంవత్సరం వాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

No comments:

Post a Comment