తెలుసా?

Telugu Lo Computer
0

 

మా పూర్వీకులు చక్రవర్తులు.

చరిత్రని తవ్వు

వర్తమాన సంకెళ్ళ వైపు చూడకు.

తెలుసా?

మాకు గతంలో మీసాలు, సింహాసనాలు వుండేవి.

మాకు రాజ్యాలు ఉన్నట్టు గుర్తు.

రాజ్యాంగంని

బొందలో పెడుతున్న వాళ్ళ గురించి నన్నడక్కు.

తెలుసా?

తిట్టుకోడం మాత్రమే

వంచించుకోవడం మాత్రమే

ద్వేషించుకోవడం మాత్రమే

తెల్సిన నాకు

ప్రేమించడం

ఎందుకు రాదని మాత్రం అడక్కు.

నా సంకెళ్ల కత

నాకు చూడరాదు.

నా హత్యల కత

నా అవమానాల కత 

నే వినను అశక్తని.

ఇలా

బతికి ఉన్నట్టు 

నీ ముందు ఫోజు కొడుతుంటాను కానీ

నే సచ్చిపోయి

కొన్ని శతాబ్దాలు అవుతుంది.

తెలుసుకోకు

నేనెప్పుడు సచ్చిపోయానో?

Post a Comment

0Comments

Post a Comment (0)